చరిత్రలో తొలిసారి.. అంతరిక్షంలోకి ఆరుగురు మహిళలు.. ఆ 11 నిమిషాలు క్షణక్షణం ఉత్కంఠే
అంతరిక్షయానంలో ఇవాళ మరో కీలక ఘట్టం జరగనుంది. ప్రపంచ కుబేరుడు జెఫ్ బీజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ సంస్థ మరో సంచలనానికి తెరలేపింది. తమ న్యూ షెపర్డ్ ఎన్ఎస్-31 మిషన్ అనే రాకెట్ ద్వారా ఆరుగురు మహిళలను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. మ్యూజిక్, మూవీస్, జర్నలిజం, రీసెర్చ్...ఇలా విభిన్న రంగాలకు చెందిన మహిళా బృందం ఏప్రిల్ 14న అంతరిక్షంలోకి ప్రయాణించనున్నట్లు బ్లూ ఆరిజిన్ సంస్థ పేర్కొంది.
1963లో రష్యాకు చెందిన కాస్మోనాట్ వాలెంటినా తెరిష్కోవా అనే మహిళా వ్యోమగామి ఒంటరిగా అంతరిక్షంలో ప్రయాణించారు. ఆ తర్వాత జరుగుతున్న పూర్తి మహిళా అంతరిక్ష ప్రయాణం ఇదే కావడం విశేషం. ఈ మహిళా బృందంలో మొత్తం ఆరుగురు ఉన్నారు. పాప్ సింగర్ కేటీ పెర్రీ, జర్నలిస్టు గేల్ కింగ్, పౌర హక్కుల న్యాయవాది అమందా ఇన్గుయెన్, నాసా మాజీ శాస్త్రవేత్త ఐషా బోవే, సినీ నిర్మాత కెరియాన్ ఫ్లిన్, లారెన్ సాంచెజ్.. ఇలా మొత్తం ఆరుగురు మహిళలు చరిత్రలో తొలిసారి అంతరిక్షయాణం చేయనున్నారు.

వీళ్లు భూమికి, అంతరిక్షానికి మధ్య ఉన్న ఊహాత్మక సరిహద్దు అయిన కర్మన్ రేఖను దాటుతారు. ఇది భూ వాతావరణానికి ఆవలి భాగంలో ఉంటుంది. కర్మన్ రేఖ అనేది ఒక ఊహాత్మక సరిహద్దు. దీనిని భూమిపై సముద్ర మట్టానికి 100 కి.మీ ఎత్తులో ఉన్నట్లు సమాచారం. ఈ సరిహద్దును భూ వాతావరణం ముగింపు, అంతరిక్షానికి ఆరంభంగా శాస్త్రవేత్తలు భావిస్తారు.












Click it and Unblock the Notifications