వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అధ్యక్ష రేసునుంచి తప్పుకున్న జిందాల్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: లూసియానా గవర్నర్ బాబీజిందాల్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరినుంచి తప్పుకుంటున్నట్టు బుధవారం ప్రకటించారు. ఆయన తన ప్రచారాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అంతేగాక, ఇది తనకు సరైన సమయం కాదని జిందాల్ అభిప్రాయపడ్డారు.

2016లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ఇండో-అమెరికన్ అయిన బాబీజిందాల్ పోటీకి దిగిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అమెరికా అభివృద్ధి గురించిన ఔట్‌లైన్ వేసుకున్నానని చెప్పారు.

Bobby Jindal drops out of White House race

అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ ఉండటంతోపాటు రిపబ్లికన్ పార్టీ నుంచే డొనాల్డ్ ట్రంప్, మాజీ న్యూరోసర్జన్ బెన్ కార్సన్ జిందాల్ కంటే ముందు దూసుకెళ్తుండడంతో వైదొలిగినట్లు సమాచారం.అంతేగాక, నిధుల సమీకరణలోను జిందాల్‌కు నిరాశ తప్పలేదని, ఆయన ఇండో-అమెరికన్ అవటం చేత అమెరికన్లు అంతగా ఆసక్తి చూపించడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

కాగా, తాను ఇండియన్ అమెరికన్‌ని కాదు, పూర్తిగా అమెరికన్‌నే అని ప్రకటించుకోవడం పట్ల అమెరికాలోని ప్రవాస భారతీయులు, భారత సంతతికి చెందిన వారు జిందాల్‌పై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమలో ఒకడని చెప్పుకుంటుండగా, జిందాల్ ఇలాంటి ప్రకటన చేయడం తమను కొంత బాధకు గురి చేసిందని ప్రవాసులు చెబుతున్నారు.

English summary
Louisiana Gov. Bobby Jindal announced Tuesday he is ending his presidential bid, saying “this is not my time.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X