ఈమెయిల్‌తో అరెస్టే: హిల్లరీపై జిందాల్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రస్తుతం డమోక్రాటిక్ పార్టీ తరుపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్‌పై లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ క్లింటన్ సెక్రటరీగా ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
ప్రభుత్వానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని తన వ్యక్తిగత మెయిల్స్‌లో ఆమె వాడుకున్నారని, కోర్టు వాదనల్లో భాగంగా పలు అబద్ధాలు చెప్పారని ఆయన ఆరోపించారు. తన వద్ద ఉన్న వివరాలతో ఒక్క ఈమెయిల్ పంపితే ఆమె అరెస్టు ఖాయమని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమెపై తీవ్ర విమర్శలు చేశారు.
ప్రభుత్వానికి సంబంధించి అత్యంత రహస్యంగా ఉంచాల్సిన మెయిల్స్‌ను సర్వర్ నుంచి ఆమె ఓపెన్ చేసి వాడుకున్నారన్న విషయం బహిర్గతమైందని తెలిపారు. బాబీ జిందాల్ ఆరోపణల నేపథ్యంలో హిల్లరీ క్లింటన్ తన ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్‌ను అధికారులకు అప్పగించేందుకు మంగళవారం అంగీకరించారు.

దీనిపై క్లింటన్ తరుపు ప్రతినిధి మాట్లాడుతూ హిల్లరీ క్లింటన్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎలాంటి ఆధికారిక దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు. జస్టిస్ డిపార్ట్‌మెంట్‌కు సర్వర్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందజేశామని తెలిపారు. స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక్క ఈమెయిల్ కూడా అందులో లేవని పేర్కొన్నారు.
2016లో జరగనున్న అమెరికా ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరుపున హిల్లరీ క్లింటన్ అధ్యక్ష బరిలో ఉండగా, రిపబ్లికన్ పార్టీ తరుపున భారతి సంతతికి చెందిన బాబీ జిందాల్ బరిలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్ధుల జాబితాలో ఉన్న బాబీ జిందాల్‌కు సీఎన్‌ఎన్ ప్రాథమిక చర్చలో పాల్గొనడానికి ఆహ్వానం వచ్చింది.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు సీఎన్‌ఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబరు 16న జరిగే చర్చలో ఆయన పాల్గొననున్నారు. ఈ చర్చలో పాల్గొనేందుకు రిపబ్లికన్ పార్టీకి చెందిన 17 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండగా అందులో 16 మందికి ఆహ్వానం వచ్చింది. వారిలో బాబీ జిందాల్‌తోపాటుగా టెడ్ క్రూజ్, జెబ్ బుష్, డొనాల్డ్ ట్రంప్ తదితరులు ఉన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications