అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో బాబీ జిందాల్!
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ 2016లో అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉండే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే, దీని పైన బాబీ జిందాల్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. అధ్యక్ష ఎన్నిక అంశంలో చర్చిస్తున్నామని అయితే, నవంబర్ వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోమని జిందాల్ చెప్పారు.
భారత సంతతి అమెరికన్ బాబీ జిందాల్ 2016లో ఆ దేశ అధ్యక్ష్య పదవి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయంటూ టైమ్ మేగజేన్ చెబుతోంది. ఆ పత్రిక తాజా సంచికలో బాబీ ఇంటర్వ్యూను ప్రముఖంగా ప్రచురించింది.

బరాక్ ఒబామా సర్కారు చేపడుతున్న పలు అంశాలపై విశ్లేషణలు చేస్తున్న జిందాల్... ఒబామా హెల్త్ కేర్‌పై ఎనిమిది మిలియన్ల మంది వ్యతిరేకంగా స్పందించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ ఏడాది నవంబర్ తర్వాత గాని ఎన్నికల విషయంపై నిర్ణయం తీసుకోలేమని ఆయన చెప్పుకొచ్చారు.
రిపబ్లికన్ పార్టీలో చోటుచేసుకున్న సైద్ధాంతిక విబేధాల నేపథ్యంలో విభజన జరిగిన పక్షంలో బాబీ జిందాల్ ఆ పార్టీకి భవిష్యత్తు ఆశాకిరణమే కాగలడని టైమ్ మేగజీన్ వ్యాఖ్యానించింది. 43 ఏళ్ల బాబీ జిందాల్ ప్రస్తుతం లూసియానా గవర్నర్‌గా ఉన్నాడు. తాము ఎంతో చేశామని, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని జిందాల్ ఇంటర్వ్యూలో చెప్పారు.












Click it and Unblock the Notifications