Bochum fire tragedy: ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

జర్మనీలోని బోచుమ్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు కాగా వారి వయసు 25 నుంచి 27 మధ్యలో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే మరొకరు పురుషుడు కాగా అతని వయసు 26 అని తెలుస్తోంది. ఇక మృతులు భారతీయులని ప్రాథమికంగా నిర్థారించినప్పటికీ వాళ్లు ఏ రాష్ట్రాలకు చెందినవారు.. వారి పేర్లు, ఇతర విషయాలు తెలియాల్సి ఉంది. రెండు వారాల క్రితమే వాళ్లు అపార్ట్ మెంట్ లోని సెకండ్ ఫ్లోర్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన 41 సంవత్సరాల రొమానియన్ కు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాద ఘటన వెనుక మానవ ప్రమేయం, కుట్ర దాగి ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన విషయాలను జర్మన్ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఘటనపై జెన్స్ ఆర్ట్స్ శ్వాగర్ అనే పోలీస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ అపార్ట్ మెంట్ లో గొడవలు జరుగుతున్నాయని తమకు ఒక్కరోజు ముందే సమాచారం వచ్చిందని అన్నారు. అయితే వీటిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఇక ఈ ఘటనకు గల కారణాలను ప్రస్తుతం తాము దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఉదయం 4 గంటల 16 నిమిషాలకు ఎమర్జెన్సీ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాయని ఉదయం 8 గంటల వరకు మంటలను ఆర్పేశారని పేర్కొన్నారు.

Bochum fire tragedy in Germany Three Indians spot dead five critically injured Romanian arrested

అలాగే ఈ అగ్నిప్రమాదంలో దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక మరో ఐదుగురు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని అయితే వెంటనే వారిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రులకు తరలించారని తెలిపారు. మరో నలుగురని నిచ్చెన సాయంతో బయటకు తీసుకొచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. మరొకరు బిల్డింగ్ మీద నుంచి సేఫ్టీ నెట్ పైకి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలిపారు. అలాగే ఈ అగ్ని ప్రమాదం నుంచి ఓ పిల్లిని కూడా కాపాడామని.. దానికి ఆక్సిజన్ సరఫరా చేసి ప్రస్తుతం వెటర్నిటీ కేర్ కు తరలించినట్లు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+