చచ్చిపోదామనుకుంటే సీన్ రివర్స్ అయింది.. కొవ్వెక్కువై బతికిపోయింది!

చైనాలోని గువాంగ్ డంగ్ ప్రావిన్స్ లో ఓ మహిళ జోంగషాన్ నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమె శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటంతో.. ఆమె నీళ్లలో మునగలేదు.

బీజింగ్: ఏదైనా తలతిక్క పనిచేసినప్పుడు.. ఒంట్లో కొవ్వెక్కువైందా? అని మందలించడం చూసే ఉంటాం. కానీ కొవ్వు కూడా కొన్నిసార్లు మేలు చేస్తుందనడానికి ఇదో ఉదాహరణ. కేవలం ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం వల్లే ఆమె బతికి బట్టకట్టిందని వైద్యులే స్వయంగా వెల్లడించారు.

ఇంతకీ విషయమేంటంటే!.. చైనాలోని గువాంగ్ డంగ్ ప్రావిన్స్ లో ఓ మహిళ జోంగషాన్ నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమె శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటంతో.. ఆమె నీళ్లలో మునగలేదు. చాలాసేపు నుంచి ఆమె నీటిపైనే తేలియాడుతుండటంతో.. అటువైపుగా వచ్చిన జాలర్లు ఆమెను గమనించారు.

Body fat thwarts chinese womans suicide attempt

అనంతరం పోలీసులకు సమాచారమిచ్చి.. వారి సహాయంతో ఆమెను నీళ్ల నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆపై ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమెను పరిశీలించి వైద్య పరీక్షలు చేశారు. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్లే ఆమె నీటిలో మునిగిపోకుండా.. పైనే తేలియాడిందని, ఆమె ధరించిన దుస్తులు కూడా ఇందుకు ఒకింత సహకరించాయని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+