మహిళను కుక్కలా కట్టేసిన ప్రాంతంలో.. మృతదేహం లభ్యం
స్పార్టన్‌బర్గ్ : కాలా బ్రౌన్ అనే 30 ఏళ్ల మహిళను కుక్కను కట్టేసినట్టు చైన్ తో కట్టేసి కంటైనర్ లో బంధించిన ఘటన దక్షిణ కరోలినాలోని ఉడ్ రఫ్ నగరంలో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాళం వేసి ఉన్న ఓ షిప్పింగ్ మెటల్ కంటైనర్ లో అత్యంత ధీన స్థితిలో ఉన్న ఆమెను పోలీసులు రక్షించారు. అయితే ఇప్పుడదే ప్రాంతంలో మరో మ్రుతదేహం లభ్యమవడం కలకలం రేపుతోంది.
మృతదేహం ఎవరిదో ఇంకా నిర్దారించినప్పటికీ.. ఇదంతా సీరియల్ కిల్లర్ గా అనుమానిస్తున్న కోహ్లెప్ (45) పనే అయి ఉంటుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో అతనిపై పలు కిడ్నాప్, రేప్ సంబంధిత కేసులు ఉండడం దీనికి ఊతమిస్తున్నాయి. ఆన్ లైన్ జైలు రికార్డుల ప్రకారం గతంలో 14ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన కోహ్లెప్ 2001లో విడుదలైనట్టుగా తెలుస్తోంది. కోహ్లెప్ దొరికితే గానీ దీనికి సంబంధించిన మిస్టరీ వీడేలా లేదు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలోనే ఉంది.

ఇకపోతే.. కంటైనర్ నుంచి శబ్దాలు వస్తున్నాయన్న సమాచారం మేరకు సెర్చ్ వారంట్ తో ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులకు 'బ్రౌన్' చైన్ తో బంధింపబడి కనిపించిన సంగతి తెలిసిందే. సెర్చ్ లో భాగంగా.. కంటైనర్ తాళం తెరిచి చూడగా.. అత్యంత ధీన స్థితిలో బ్రౌన్ ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. అసలప్పటిదాకా బ్రౌన్ బ్రతికుండడమే పెద్ద ఆశ్చర్యం అని పోలీసులు అభిప్రాయపడ్డారు.
కాగా, బ్రౌన్ ను గుర్తించిన ప్రాంతం కోహ్లెప్ కి చెందినది కావడంతో.. ఆమెపై రేప్ జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. గత రెండు నెలల నుంచి బ్రౌన్ అదే కంటైనర్ లో ఉన్నట్టు బ్రౌన్ తెలిపింది. తన బాయ్ ఫ్రెండ్ చార్లెస్ కార్వర్ (32) కూడా మిస్సవడంతో సదరు నేరస్తుడిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం కాలా బ్రౌన్ ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. చికిత్స అనంతరం బ్రౌన్ ను విచారించి కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు పోలీసులు.












Click it and Unblock the Notifications