Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తప్పిన ముప్పు: రన్‌వే నుంచి అదుపు తప్పి నదిలో ల్యాండ్ అయిన బోయింగ్ విమానం

Recommended Video

    రన్‌వే నుంచి అదుపు తప్పి.. నదిలో ల్యాండ్ అయిన బోయింగ్..!! || Oneindia Telugu

    ఫ్లోరిడా: ఫ్లోరిడాలో పెద్ద విమాన ప్రమాదం తప్పింది. జాక్సన్‌విల్లే విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత రన్‌వేకి చివరగా ఉన్న సెయింట్ జాన్సన్‌ నదిలోకి విమానం దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 136 మంది ఉన్నారు. గ్వాంటనామో బే నుంచి జాక్సన్‌విల్లేకు బోయింగ్ 737 విమానం బయలు దేరింది. స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 9గంటల 40 నిమిషాలకు ల్యాండ్ అయిన జంబో విమానం ఒక్కసారిగా నదిలోకి దూసుకెళ్లింది.


    విమానం నదిలోకి దూసుకెళ్లగానే విమానంలోని ప్రయాణికులు భయాందోళనలతో వణికిపోయారు. బయట ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. చిమ్మ చీకటిలో ఏమీ కనిపించకపోవడంతో ప్రయాణికులు భయపడ్డారు. ఇదిలా ఉంటే ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. విమానంలో ఉన్నవారంతా క్షేమంగా ఉన్నట్లు జాక్సన్‌విల్లే మేయర్ ట్విటర్ ద్వారా తెలిపారు. విమానం నదిలోకి దూసుకెళ్లడంతో విమానం ఇంధనం కాస్త లీక్ అయినట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే ఎమర్జెన్సీ సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిన పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

    Boeing skids off the runway and lands in river in Florida,passengers safe

    ఇదిలా ఉంటే విమానం రన్‌వేపై ఎలా స్కిడ్ అయ్యిందనే దానిపై విచారణ చేస్తున్నారు. పైలట్ల తప్పిదం ఏమైనా ఉందా లేక ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా అనే కోణంలో కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రయాణికులంతా క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+