ప్లేన్ కార్గోలో బాంబు: బ్రిటన్ షాకింగ్, తొందరొద్దు: రష్యా

లండన్: రష్యాకు చెందిన విమానం ఈజిప్ట్‌లో కూలిపోయిన సంఘటన పైన బ్రిటన్ అధికారులు శుక్రవారం నాడు మరో సంచలన విషయం చెప్పారు. విమానం కార్గోలో ముందే బాంబులను అమర్చారని, అందువల్లే ఆ విమానం పేలిపోయిందని భావిస్తున్నామన్నారు.

బాంబును లగేజీ లోపల లేదా బయట ఈ బాంబును అమర్చి ఉండవచ్చని బ్రిటన్ అధికారులు వెల్లడించారు. కాగా, రష్యాకు చెందిన విమానం కూలిపోవడం వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని, బాంబు దాడి వలనే ఆ విమానం కూలిపోయిందని అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన భద్రతా విభాగానికి చెందిన అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.

Bomb that blew up Russian plane in Egypt was 'placed in cargo hold'

గత వారం సినాయ్ పెనిన్సులాలో విమానం కుప్పకూలి 224 మంది ప్రయాణికుల ప్రాణాలు కోల్పోయారు. గత శనివారం నాడు ఎయిర్ బస్ ఏ 321.... 217 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో కలసి ప్రయాణిస్తూస ఈజిప్టులో కూలిపోయింది.

దానిని తామే కూల్చేశామని ఐసిస్ ఉగ్రవాదులు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. మరోవైపు, విమానంలో బాంబును ముందే అమర్చారని భావించడం తొందరపాటు చర్యని రష్యా, ఈజిప్ట్ ప్రభుత్వాధికారులు వ్యాఖ్యానించారు. దీనిపై అన్ని అంశాలనూ దర్యాఫ్తు చేస్తున్నందున సాధ్యమైనంత త్వరగా నిజానిజాలు వెల్లడవుతాయని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+