సోడాక్యాన్ లో బాంబు: రష్యా విమానం పేల్చేశాం

కైరో/సిరియా: ఇటీవల కూలిన రష్యా విమానంలోకి తాము బాంబును ఎలా అమర్చామో పూసగుచ్చినట్లు వివరిస్తూ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు ఓ కథనం వెల్లడించారు. పేలుడు పదార్థాలు దాచి తరలించిన వస్తువుల చిత్రాలను తన ఆన్ లైన్ మ్యాగజైన్ దభిఖ్ లో ప్రచురించింది.

ఈ చిత్రాలతో పాటు రష్యా విమానంలో ప్రయాణించిన కొందరు ప్రయాణికుల పాస్ పోర్టులు, వారి వివరాలను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఈ కథనంలో ప్రచురించారు. గత నెల 31న ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పం లో రష్యా విమానం కూలిన ఘటనలో 224 మంది మరణించిన విషయం తెలిసిందే.

ఈ విమానం తామే కూల్చివేశామని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు స్పష్టం చేశారు. బాంబులు పెట్టి విమానం పేల్చివేశామని చెప్పారు. అయితే రష్యా మొదట సాంకేతిక లోపం వల్లనే తమ విమానం కూలిపోయిందని పదే పదే చెప్పింది.

Bomb Which Downed Russian Plane Was Hidden in Soda Can: ISIS

చివరికి బాంబు పేలుడు వల్లనే విమానం కూలిపోయిందని రష్యా అంగీకరించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తెలిపిన కథనం మేరకు సోడాక్యాన్ లో బాంబులు పెట్టి ఎయిర్ పోర్టు సిబ్బంది కళ్లు గప్పి రష్యా విమానంలో పెట్టారని వెలుగు చూసింది.

ఈజిప్టులోని రెడ్ సీ రిసార్ట్ నుంచి రష్యాలోని సెయింట్ పీటర్ బర్గ్ కు వెలుతున్న విమానాన్ని తామే కూల్చేశామని ఐఎస్ఐఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. సిరియా, ఇరాక్ లో వైమానిక దాడులు చేస్తున్న అమెరికా మిత్రరాజ్యాల విమానాలు కూల్చాలని ఐఎస్ఐఎస్ మొదట భావించింది.

అయితే అదే సమయంలో రష్యా యుద్దవిమానాలు సైతం సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఫైటర్స్ మీద వైమానిక దాడులు చెయ్యడంతో ఆదేశానికి చెందిన విమానాన్ని లక్షంగా చేసుకుని వారు అనుకున్న టార్గెట్ పూర్తి చేశారు.

తమ విమానం బాంబు పేలుడు వలనే కూలిపోయిందని, అందుకు కారణం అయిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని రష్యా హెచ్చరించింది. ఇప్పుడు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలు ఐఎస్ఐఎస్ అంతు చూడటానికి సిద్దం అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+