బాల్కనీలోంచి దూకేసిన బాస్... షాకైన ఉద్యోగులు, తర్వాత ఏం జరిగిందంటే..
ఓ సాప్ట్ వేర్ కంపెనీ యజమాని మీటింగ్ ఉందంటూ ఉద్యోగులను పిలిచాడు. ఉద్యోగులంతా మీటింగ్ కు వచ్చారు. బాస్ కూడా వారితో చాలా ఉత్సాహంగా మాట్లాడాడు. మీటింగ్ ముగిసిందో లేదో ఒక్కసారిగా బిల్డింగ్ బాల్కనీలోంచి బ
మోస్టర్: ఓ సాప్ట్ వేర్ కంపెనీ యజమాని మీటింగ్ ఉందంటూ ఉద్యోగులను పిలిచాడు. ఉద్యోగులంతా మీటింగ్ కు వచ్చారు. బాస్ కూడా వారితో చాలా ఉత్సాహంగా మాట్లాడాడు. మీటింగ్ ముగిసిందో లేదో ఒక్కసారిగా బిల్డింగ్ బాల్కనీలోంచి బాస్ కిందికి దూకేశాడు.
తమ కళ్లెదుటే జరిగిన ఈ అఘాయిత్యంతో షాక్ కు లోనైనా ఉద్యోగులు తేరుకుని ఘెల్లుమంటూ కిందికి పరుగుదీశారు. అందరిలోనూ ఒకటే ఆందోళన.. కొంతమంది ఉద్యోగులైతే ఇక తమ బాస్ లేడనుకున్నారు.
నమ్మడం లేదా? అరె.. ఈ సంఘటన నిజంగా జరిగింది. కాకపోతే, మన దేశంలో కాదులెండి, బోస్నియా అండ్ హెర్జిగోవినాలోని మోస్టర్ లో. అన్ లైన్ గేమింగ్, స్పోర్ట్స్ బెట్టింగ్ ఇండ్రస్టీలో పేరున్న ఎన్ సాఫ్ట్ అనే సాఫ్ట్ వేర్ సంస్థ యజమాని అయిన ఇగోర్ క్రెజిక్ ఉన్నట్లుండి చేసిన ఈ పనికి పాపం ఆ కంపెనీ ఉద్యోగులకు నోట మాట రాలేదు.
ఆయన అలా తన కార్యాలయంలోని బాల్కనీ నుండి కిందికి దూకగానే ఉద్యోగులు ఉరుకులు పరుగులతో బాల్కనీలోకి వచ్చి తొంగి చూశారు. కింద ముందుగానే ఏర్పాటు చేసుకున్న క్రాష్ మ్యాట్ మీద వాళ్ల బాస్ నవ్వుతూ కనిపించడంతో అంతా అవాక్కయ్యారు.
తన ఉద్యోగులకు 'పొలిటికల్ సూసైడ్' అనే అంశం గురించి చెప్పేందుకే తాను అలా చేశానని తరువాత వాళ్ల బాస్ క్రెజిక్ వెల్లడించాడు. గతంలో కూడా ఈయన ఇలాంటి చర్యలతో తన కంపెనీ ఉద్యోగులను షాక్ కు గురిచేశాడట.












Click it and Unblock the Notifications