అక్రమ సంబంధం గురించి తెలిసి, పురుషాంగాన్నే కత్తిరించేశాడు..

Subscribe to Oneindia Telugu

టోక్యో : హత్యలతో వివాహేతర సంబంధాలు నిత్యం వార్తల్లొకి ఎక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఓ వివాహేతర సంబంధం విషయంలో టోక్యోకి చెందిన ఓ వ్యక్తి ప్రతీకారం తీర్చుకున్న తీరును అందరిని నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

టోక్యోకు చెందిన 25 యేళ్ళ ఇక్కి కోట్సుగెయ్ అనే బాక్సర్ తన భార్య ఓ లాయర్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోన్న విషయాన్ని తెలుసుకున్నాడు. దీంతో తన భార్యను తన నుంచి దూరం చేస్తోన్న సదరు లాయర్ పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన కోట్సుగెయ్ ఏకంగా సదరు న్యాయవాది పురుషాంగాన్నే కత్తిరించి పారేశాడు.

Boxer is jailed for slicing off his love rival's penis with garden shears

వివాహేతర సంబంధం విషయం తెలియగానే.. మొదట సదరు న్యాయవాది ఇంటికెళ్లి అతనిపై బాక్సింగ్ తరహాలో పిడి గుద్దులు కురిపించాడు బాక్సర్ కోట్సుగెయ్. అనంతరం వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ తో సదరు న్యాయవాది పురుషాంగాన్ని కత్తిరించేసి, టాయ్ లెట్ లో పడేసి వెళ్లిపోయాడు.

కాగా, తన భార్య సమక్షంలోనే కోట్సుగెయ్ 2015లో ఈ ఘటనకు పాల్పడ్డాడు. అనంతరం పోలీసు కేసు నమోదు కావడంతో కోర్టు విచారణలో కేసుపై ఇటీవలే తుది తీర్పు వెలువడింది. ఘటనకు సంబంధించిన పూర్తి విచారణ తర్వాత న్యాయమూర్తి కోట్సుగెయ్ కు నాలుగున్నర సంవత్సరాల జైలుశిక్ష విధించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A former boxer who chopped off the penis of his wife's lover with a pair of garden shears before flushing it down the toilet has been jailed.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి