తండ్రి మీద అలిగి ఎంత పనిచేశాడంటే: చూస్తే గుండెలదిరిపోవాల్సిందే.. (వీడియో)
Recommended Video

బీజింగ్: పిల్లల్ని పెంచి పెద్ద చేయడమంటే మామూలు విషయం కాదు. అసలే ఈరోజుల్లో అందరి మనోభావాలు ఇట్టే దెబ్బతింటున్నాయి. ఇక పిల్లల మనోభావాలు దెబ్బ తింటే ఇంకేమైనా ఉందా?.. ఇల్లు పీకి పందిరేసేయరు.. కొంతమంది గడుగ్గాయిలైతే తల్లిదండ్రులు ఏమైనా అంటే చాలు.. వాళ్ల గుండెలదరిపోయేంత పనిచేస్తారు.
చైనాలో ఓ 12ఏళ్ల బాలుడు కూడా వారి తల్లిదండ్రులకు ఇలాగే ముచ్చెమటలు పట్టించాడు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ కథనాన్ని వెలుగులోకి తెచ్చింది. ఉదయాన్నే నిద్రలేవడని, ఎప్పుడూ బద్దకంగా ఉంటాడని తండ్రి తిట్టినందుకు ఆ బాలుడు బాగా అలిగాడట. తండ్రి మీద కోపంతో.. ఏకంగా బెడ్ రూమ్ కిటికీలో నుంచి బయటకు వెళ్లి, దాని కిందే ఉన్న మరో కిటికీపై చేతులు కట్టుకుని పడుకున్నాడు.

ఐదో అంతస్తులో ఉన్న ఆ కిటికీపై ఏమాత్రం భయం లేకుండా ఆ బాలుడు హాయిగా పడుకోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న తల్లిదండ్రుల గుండెలు అదిరిపోయాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు అగ్నిమాపకశాఖ వారిని అక్కడికి పంపించారు. దీంతో ఫైర్ సిబ్బంది తమ వద్ద ఉన్న సేఫ్టీ నిచ్చెనతో అతన్ని కిందకు దించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
-
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్!












Click it and Unblock the Notifications