బంపర్ ఆఫర్: తండ్రయితే పూర్తి జీతంతో ఏడాది లీవ్
లండన్: ప్రసవం కోసం గర్భిణీ మహిళలకు మెటర్నటీ లీవ్ ఇవ్వడం సాధారణమే. కానీ. ఇక్కడ ‘వర్జిన్' అనే సంస్థ మాత్రం మగవాళ్లకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. తండ్రి అయితే పూర్తి జీతంతో కూడిన ఏడాది సెలవు మంజూరు చేయాలని నిర్ణయించింది. అయితే అందుకు ఆ సంస్థలో నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలని అర్హతను నిర్ణయించింది.
యూకేలోని వర్జిన్ గ్రూప్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ అండ్ బ్రాండ్ లైసెన్సింగ్ సంస్థ ఉంది. ఈ సంస్థకు యూకేతోపాటు ఇతర దేశాల్లో కూడా శాఖలు ఉన్నాయి. సుమారు 50వేల మంది ఉద్యోగులు సంస్థలో పని చేస్తున్నారు.

అయితే యూనైటెడ్ కింగ్‌డమ్, జెనీవా శాఖల్లో పని చేసే ఉద్యోగులకు మాత్రమే ఈ ఆఫర్‌ను వర్తింపజేస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. వీరిలో నాలుగేళ్ల సర్వీసు లేకపోతే రెండేళ్లైనా పని చేసి ఉండాలని, అలా రెండేళ్లు పని చేసిన ఉద్యోగులకు ఏడాది సెలవు, 25శాతం జీతం చెల్లించనున్నట్లు సంస్థ తెలిపింది.
కేవలం బిడ్డల్ని కంటేనే కాదట, దత్తత తీసుకున్నా ఈ సెలవు, జీతం వర్తిస్తాయని సంస్థ ప్రకటించడం కొసమెరుపు. తండ్రి అయిన తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలంటే చాలా బాధగా ఉంటుందని, ఆ బాధను తాను అనుభవించానని, అలాంటి బాధ తన సంస్థలో పని చేసే ఉద్యోగులు అనుభవించకూడదనే ఈ ఆఫర్ ఇచ్చినట్లు వర్జిన్ గ్రూప్ అధినేత బ్రాన్సన్ తెలిపారు.












Click it and Unblock the Notifications