భయంతో వణికిపోయిన తండ్రి.. ధైర్యంగా లాక్కొచ్చిన చిన్నారి.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు

తండ్రి భయంతో వణికిపోయి అడుగేయలేక కుప్పకూలిపోగా, ఆరేళ్ల వయసున్న అతడి కొడుకు ధైర్యంగా తండ్రి చేయి పట్టుకుని లాక్కుంటూ తీసుకెళ్లిన ఈ దృశ్యం చూస్తుంటే నోట్లోంచి ఒకటే మాట వస్తుంది ఎవరికైనా.. ‘శభాష్ బేటా..’

బీజింగ్: తండ్రి భయంతో వణికిపోయి అడుగేయలేక కుప్పకూలిపోగా, ఆరేళ్ల వయసున్న అతడి కొడుకు ధైర్యంగా తండ్రి చేయి పట్టుకుని లాక్కుంటూ తీసుకెళ్లిన ఈ దృశ్యం చూస్తుంటే నోట్లోంచి ఒకటే మాట వస్తుంది ఎవరికైనా.. 'శభాష్ బేటా..' అని!

విషయం ఏమిటంటే.. ఛైనాలో ఓ వ్యక్తి సరదాగా గాజు వంతెనపై నడవాలనుకున్నాడు. ఆరేళ్లు కూడా నిండ‌ని తన కొడుకుని కూడా వెంట తీసుకెళ్లాడు. చైనాలోని వాన్‌షెన్‌ నేషనల్‌ పార్కులో ఉన్న గాజు వంతెన దగ్గరికి వెళ్లాడు. కొడుకుతో సహా మెల్లగా గాజు వంతెనపై న‌డవడం ప్రారంభించాడు.

son-dragging-dad

నడుస్తూ నడుస్తూ ఎందుకో కిందికి చూసే సరికి ఆ వ్యక్తికి గుండెలు జారిపోయాయి. అమ్మో.. ఉన్నట్లుండి కాళ్ల కింద ఉన్న గాజు పగిలి.. ఇక్కడ్నించి పడిపోతే.. ' అనే ఆలోచన రాగానే అతడు భ‌యంతో వ‌ణికిపోయాడు. దాంతో ఆ వంతెనపై నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి విపరీతంగా భయపడి అక్కడే కూలబడిపోయాడు.

అయితే, అత‌డి కుమారుడు మాత్రం గాజు వంతెన‌పై చ‌లాకీగా న‌డిచాడు. తండ్రికి ధైర్యం చెప్పాడు. చెయ్యి ప‌ట్టుకొని వంతెనపై లాక్కెళ్లాడు. ఈ దృశ్యాన్ని వీడియోలో చూస్తోన్న నెటిజ‌న్లంద‌రూ ఆ బాలుడి ధైర్యానికి ముగ్ధుడై 'హ్యాట్సాఫ్..' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఆ బాలుడి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. ఆ పార్కులో కొండ చుట్టూ 330 అడుగుల ఎత్తులో 213 అడుగుల పొడవుతో ఈ గాజు వంతెన ఉంటుంది. ఈ చిన్నారి త‌న తండ్రికి ధైర్యం చెబుతూ ఎలా లాక్కెళుతున్నాడో మీరూ చూడండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+