Romantic Guy:ఒకే ఒక్కడు..ఆరుగురు భార్యలు.. అందరితో ఒకేసారి..ఇదీ స్టోరీ..!
బ్రెజిల్: ఈ రోజుల్లో మగవారికి పెళ్లి సంబంధాలు రావడమే కష్టంగా మారాయి. అమ్మాయిల తరపున పెద్దవాళ్లు అబ్బాయి ఉద్యోగం, ఎంత సంపాదిస్తున్నాడు, వెనక ఆస్తులు ఏమైనా ఉన్నాయా లేదా అని ఇలా పలు అంశాలను విచారించుకున్న తర్వాతే పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం అంతా ఓకే అనుకుంటే కూతురుని మరో ఇంటికి కోడలుగా పంపడం చేస్తున్నారు. కానీ ఈ స్టోరీలో మాత్రం మనకు ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కనిపిస్తాడు.
బ్రెజిల్‌లో ఆర్థర్ అనే 37ఏళ్ల అందగాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9మందిని పెళ్లి చేసుకున్నాడు. ఈ అందగాడిని చూసి అక్కడి అమ్మాయిలు కూడా క్యూ కట్టారు. దీంతో 9మందిని వివాహం చేసుకుని ఆ తర్వాత ఇందులో ముగ్గురికి విడాకులు కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం ఆరుగురు భార్యలతో సంసారం ఈదుతున్నాడు. ఈ ఆరుగురిలో ఒకావిడకు 51 ఏళ్లు.

అంతాబాగానే ఉన్నా మనోడికి ఓ కష్టం వచ్చి పడింది. ఎవరితో ముందు బిడ్డలను కనాలా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. ఒక భార్యతో ముందు బిడ్డను కంటే మిగతా ఐదుగురు భార్యలు చాలా ఫీలవుతారని చెప్పుకొచ్చాడు. ఇందుకోసం సరోగసీ పద్ధతి ద్వారా ఆరుగురు భార్యలతో ఒకేసారి బిడ్డలను కనాలని డిసైడై ఎలాంటి గడబిడ లేకుండా స్పష్టమైన క్లారిటీతో ఉన్నాడు.
అంతకుముందున్న ఓ భార్య ద్వారా కూతురు కన్నాడు ఆర్థర్. ఇప్పుడు ఆ చిన్నారి వయసు పదేళ్లు. ఇప్పుడు కొడుకు కావాలని ఆశిస్తున్నాడు. అయితే ముందుగా తన మొదటి భార్య అయిన లూనాతో సరోగసి పద్ధతి ద్వారా బిడ్డను కనాలని భావిస్తున్నాడు. ఇది సక్సెస్ అయితే అందరితో బిడ్డలను కనేందుకు డిసైడయ్యాడు. అయితే ఇది కొంత సమయం తీసుకుంటుంది. కానీ ఇప్పటికిప్పుడంటే సరోగసీ పద్దతే బెస్ట్ అని భావిస్తున్నాడు.
ఈ ప్రక్రియకు తాను భారీగా ఖర్చు చేసేందుకు కూడా వెనకాడటం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు భవిష్యత్తులో మరింత మంది పిల్లలను దత్తత తీసుకోవాలని భావిస్తున్నారు. కొన్ని నెలల ముందు ఇదే ఆర్థర్ 10మంది అమ్మాయిలను పెళ్లి చేసుకుని వారితో పిల్లలను కనాలనేది తన లక్ష్యంగా చెప్పుకొచ్చాడు.












Click it and Unblock the Notifications