రికార్డుల రారాజు పీలే కన్నుమూత - చివరి నిమిషం వరకు పోరాటం..!!
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ పీలే (82) తుది శ్వాస విడిచారు. మంత్ర ముగ్డుదైన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించారు. క్యాన్సర్ తో చివరి నిమిషం వరకు పోరాడారు. ఫుట్‌బాల్ ప్రేమికులను విషాదంలోకి నెట్టారు.16 ఏళ్ల వయసులోనే బ్రెజిల్ జాతీయ జట్టలో చేరి..మూడు సార్లు ప్రపంచకప్ గెలిచి రికార్డు సాధించారు. నాలుగు ప్రపంచ కప్ లు ఆడారు. కొద్ది రోజులుగా పీలే పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. రోజురోజుకూ అతని పరిస్థితి మరింత దిగజారింది. ప్రాణాలతో పోరాడుతున్న పీలే మరణాన్ని ఆయన కుమార్తె ధృవీకరించారు. పీలే మరణం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా ద్వారా తుది వీడ్కోలు పలుకుతున్నారు.
🐐 Pelé’s Major Honours;
— FIFA World Cup Stats (@alimo_philip) December 29, 2022
🏆🏆🏆🏆🏆🏆Brasileiro
🏆🏆🏆 FIFA World Cup
🏆🏆 Copa Libertadores
🎖️FIFA Player of the Century
🎖️1970 World Cup Golden Ball
🎖️Youngest World Cup Winner
🎖️Most hat-tricks of all time-92
🎖️Most World Cup assists-10
🎖️Honorary Ballon d’Or#Pele|#BRA pic.twitter.com/eShUBmAliE
పీలే అక్టోబర్ 23, 1940న బ్రెజిల్‌లోని ట్రెస్ కొరాకోస్‌లో జన్మించారు. పీలే అసలు పేరు ఎడ్సన్ అరంటెస్ డో నాస్సిమెంటో. పీలే 15 సంవత్సరాల వయస్సులో శాంటోస్ తరపున ఫుట్‌బాల్ ప్లేయర్ గా జీవితం ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే 16 సంవత్సరాల వయస్సులో పీలే బ్రెజిల్ జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నారు. 7 జూలై 1957న అర్జెంటీనా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసారు. ఆ మ్యాచ్‌లో బ్రెజిల్ 2-1తో విజయం సాధించగా, పీలే ఆ మ్యాచ్‌లో గోల్ చేసి చరిత్ర సృష్టించారు. పీలే నాయకత్వంలో బ్రెజిల్ బ్రెజిల్ 1958, 1962, 1970లో ప్రపంచకప్‌ను గెలుచుకుంది. మూడు ప్రపంచకప్‌లు గెలిచిన ఏకైక ఆటగాడిగా పీలే రికార్డు నెలకొల్పారు.

1971లో బ్రెజిల్ జాతీయ జట్టు నుంచి రిటైర్ అయ్యారు. పీలే ఫుట్ బాల్ ప్లేయర్ గా తన కెరీర్ లో మొత్తం 1363 మ్యాచ్‌లు ఆడి 1281 గోల్స్ చేశాడు. బ్రెజిల్ తరపున 91 మ్యాచ్‌ల్లో 77 గోల్స్ చేసి ఎవరూ తిరగరాయలేని రికార్డులు నెలకొల్పారు. అతి పిన్న వయసులో ప్రపంచ కప్ ఆడిన క్రీడాకారుడిగానూ పీలే పేరు మీద రికార్డు ఉంది. పీలే మొత్తం కెరీర్ లో కెరీర్‌లో 3 ఫిఫా ప్రపంచ కప్‌లను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. పీలే 6 బ్రెజిలియన్ లీగ్ టైటిళ్లను గెలుచుకున్నారు. రెండుసార్లు కోపా లిబర్టాడోర్స్ టైటిల్‌ను దక్కించుకున్నారు. ఫిఫా నుంచి 'ది గ్రేటెస్ట్' బిరుదు సైతం సొంతం చేసుకున్నారు. పీలే మరణం పై క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ, కైలియన్ ఎంబాప్పే, సెర్గియో రామోస్, మెసుట్ ఓజిల్ వంటి ఆటగాళ్లు పీలే మృతికి సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications