పోలీసుల అదుపులో మాజీ అధ్యక్షుడు
బ్రెజిల్: అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాను స్థానిక పోలీసు అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. లూయిజ్ ఇంటిని పోలీసు అధికారులు సోదా చేసి విలువైన డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం సావోపాలో లోని లూయిజ్ నివాసం, కార్యాలయం, లూయిజ్ కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాల్లో పోలీసు అధికారులు సోదాలు చేశారు. అక్కడ తనిఖీల్లో బయటపడిన విలువైన పత్రాలను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు.

బ్రెజిల్ అధ్యక్షుడిగా అధికారంలో ఉన్న సమయంలో లూయిజ్ అధికార దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో అధికారులు కేసు నమోదు చేశారు. బ్రెజిల్ రాజకీయాల్లో లూయిజ్ శక్తివంతమైన నాయకుడు. రాజకీయ కక్షలతోనే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని లూయిజ్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications