బ్రిటన్‌లో జాతి వివక్ష దాడులకు సజీవ సాక్ష్యం ఈ వీడియో

లండన్: బ్రెగ్జిట్ నిర్ణయం తర్వాత బ్రిటన్‌లో జాతి విద్వేష దాడులు ఎక్కువయ్యాయి. బ్రిటన్‌లో యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల పౌరులకే కాదు, భారతీయులకు వ్యతిరేకంగా కూడా దాడులు కొనసాగుతున్నాయి. అధికారికంగా ఇప్పటి వరకు నాలుగైదు కేసులే నమోదైనప్పటికీ, ఈ వారం రోజుల్లో వందకుపైగా జాతి విద్వేష దాడులు జరిగినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా స్పష్టమవుతోంది.

ప్రస్తుతానికి ఈ దాడులు జాతి విద్వేష వ్యాఖ్యలకే పరిమితమవుతున్నాయి. రాబోయే రోజుల్లో బ్రిటన్ ప్రజలు భౌతిక దాడులకు దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తమపై దాడులు జరుగుతాయన్న భయంతో లండన్ పౌరసత్వం కలిగి అక్కడే స్థిరపడిన విదేశీయులు తమ పాస్‌పోర్టులను వెంట తీసుకెళ్తున్నారు.

అంతేకాదు దారిలో దాడులకు దిగుతున్న బ్రిటన్ ప్రజలకు వీటిని చూపిస్తున్నారు. ఇది, దేశానికి నిజంగా సిగ్గు చేటని, ఇక ఇలాంటి దాడులు ఏమాత్రం సహించమని, దోషుల పట్ల కఠినంగా వ్వవహరిస్తామని ప్రధాన మంత్రి డేవిడ్ కేమరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పరిస్థితిలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు.

లండన్‌లోని ప్రఖ్యాక ఆక్స్‌ఫర్డ్ వర్శిటీలో చదువుతున్న నిఖిల్ పాండే అనే భారతీయ విద్యార్థి ఇటీవలే ఎయిర్‌పోర్టులో జాతి విద్వేష వ్యాఖ్యలను ఎదుర్కోన్నాడు. 'ఓ వ్యక్తి నన్ను ఎయిర్ పోర్టులో ఏ దేశం నుంచి వచ్చావని అడిగారు. నేను భారత్ నుంచి వచ్చానని చెప్పాను. వెంటనే నా పాస్‌పోర్టు లాక్కున్నాడు. బ్రిటన్‌లో నా నివాసం ధ్రువపత్రాన్ని కూడా లాక్కున్నాడు. పాస్‌పోర్టుపై నేను రెండేళ్ల క్రితం తీసుకున్న ఫొటో ఉంది. ఆ ఫొటోలో నాకు గడ్డం ఉంది. దాన్ని చూసి ఆయన నన్ను టైస్టులాగా ఉన్నావంటూ వ్యాఖ్యానించాడు. ఇలాంటి అవమానం నాకు బ్రిటన్‌లో ఎప్పుడూ జరగలేదు. నేను రెండేళ్ల నుంచి బ్రిటన్‌లో ఉంటున్నా నేనెప్పుడూ ఈ దేశం జాతి విద్వేష దేశమని ఎప్పుడూ భావించలేదు' అని పాండే తనకు జరిగిన అవమానాన్ని మీడియాకు వివరించారు.

ఇదిలా ఉంటే మాంచెస్టర్‌లోని ఓ ట్రామ్‌లో జరిగిన జాతి విద్వేష వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. బ‌్రెగ్జిట్ త‌ర్వాత బ్రిట‌న్‌లో జాతి వివ‌క్ష‌, వ‌ల‌స వ‌చ్చిన వారిపై దాడులు ఎంత‌లా పెరిగిపోయాయో చెప్ప‌డానికి ఈ వీడియో ఓ సజీవ సాక్ష్యం. వీడియోలో ఓ 18 ఏళ్ల యువ‌కుడు ట్రామ్‌లో ఉన్న ఆఫ్రిక‌న్ వ్య‌క్తిని ట్రామ్ నుంచి వెంట‌నే దిగిపో.. మీ ఆఫ్రికాకు వెళ్లిపో అంటూ అర‌వ‌డం ఇందులో క‌నిపించింది.

ఆ యవకుడికి మ‌రో ఇద్ద‌రు తోడ‌య్యారు. అందులో ఒక‌డు త‌న చేతిలోని బీర్‌ను ఆ ఆఫ్రిక‌న్ వ్య‌క్తిపై చల్లాడు. తాను ఏడేళ్లు ఆర్మీలో పనిచేశానని ఆ ఆఫ్రికన్ వ్యక్తి చెప్పడం వినిపించింది. ఆ ట్రామ్‌లోనే ఉన్న స్థానిక ఇంగ్లండ్ వాసులు మాత్రం ఆ యువ‌కుల తీరును త‌ప్పుబ‌ట్టారు. మీ వ‌ల్లే ఇంగ్లండ్‌కు చెడ్డ పేరు వ‌స్తున్న‌ద‌ని వార‌న్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ముగ్గురు యువ‌కుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+