బ్రిక్స్ విస్తరణ- మోదీ మాటంటే మాటే..!!

జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌లో ఏర్పాటైన బ్రిక్స్ సమ్మిట్‌ ఓపెన్ ప్లీనరీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. బ్రిక్స్‌ను భవిష్యత్ అవసరాలకు సంసిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఇందులో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

ప్రస్తుతం బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు సభ్యత్వం ఉంది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, రష్యా తరఫున ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గెయ్ లావ్రొవ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధినేత గ్ఝి జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా- ఈ అత్యున్నత సదస్సుకు హాజరయ్యారు.

BRICS summit 2023: 6 countries to join BRICS as new members

వారందరూ పాల్గొన్న ఈ ఓపెన్ ప్లీనరీలో మోదీ- బ్రిక్స్ విస్తరణకు హామీ ఇచ్చారు. దీన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి బ్రిక్స్‌ను విస్తరించాల్సి వస్తే.. తాము మద్దతు ఇస్తామని అన్నారు.

దీనికి అనుగుణంగా బ్రిక్స్‌ను విస్తరించారు. కొత్త దేశాలకు సభ్యత్వాన్ని ఇచ్చారు. కొత్తగా మరో ఆరు దేశాలు బ్రిక్స్‌లో జాయిన్ కానున్నాయి. వచ్చే ఏడాది జరిగే బ్రిక్స్ సమ్మిట్‌ నాటికి ఆ దేశాలకు సభ్యత్వం లభించనుంది. బ్రిక్స్ విస్తరణకు మద్దతు ఇస్తామని మోదీ ప్రకటించిన మరుసటి రోజే- కొత్త దేశాలకు సభ్యత్వాన్ని కల్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇక కొత్తగా బ్రిక్స్‌లో అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ సభ్యత్వం లభించింది. తమకు సభ్యత్వాన్ని కల్పించడం పట్ల ఆయా దేశాధినేతలు, ప్రధానమంత్రులు ఇప్పుడున్న సభ్య దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడిగా పురోగమించడానికి అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+