బ్రిక్స్ సదస్సు: మోడీతో జిన్ పింగ్ కరచాలనం, ఉత్తరకొరియాపై తీవ్ర ఆగ్రహం!

చైనాలోని జియామెన్ లో బ్రిక్స్ సదస్సు ప్రారంభమైంది. సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాధినేతలు చేరుకున్నారు.

బీజింగ్: చైనాలోని జియామెన్ లో బ్రిక్స్ సదస్సు ప్రారంభమైంది. సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాధినేతలు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ నిరంతర అణ్వాయుధ పరీక్షలతో ఉత్తరకొరియా ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోందని మండిపడ్డారు. ఉత్తరకొరియా తీరు మార్చుకోవాలని జిన్‌పింగ్‌ సూచించారు.

బ్రిక్స్ సాక్షిగా.. ఉత్తరకొరియాపై..

బ్రిక్స్ సాక్షిగా.. ఉత్తరకొరియాపై..

అగ్రరాజ్యం అమెరికా వారిస్తున్నా, ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధిస్తున్నా ఉత్తర కొరియా తన పద్ధతి మార్చుకోకపోవడంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ బ్రిక్స్ సదస్సు సాక్షిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వేషాలు, రెచ్చగొట్టే ప్రకటనలు మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియా ప్రకటనలు, చేస్తున్న క్షిపణి పరీక్షలు ప్రపంచ శాంతికి విఘాతంగా మారుతున్నాయని జిన్‌పింగ్‌ మండిపడ్డారు.

మోడీకి సాదర ఆహ్వానం.. కరచాలనం

మోడీకి సాదర ఆహ్వానం.. కరచాలనం

బ్రిక్స్‌ దేశాల కూటమి సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం చైనా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బ్రిక్స్‌ సదస్సు కోసం ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సెంటర్‌కు వచ్చిన ప్రధాని మోడీని.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సాదరంగా స్వాగతించారు. ఇద్దరు కరచాలనం చేసుకుని నవ్వుతూ పలకరించుకున్నారు.

రేపు ద్వైపాక్షిక చర్చలు...

రేపు ద్వైపాక్షిక చర్చలు...

భారత్‌-చైనా మధ్య దాదాపు రెండు నెలలపాటు డోక్లామ్‌ వివాదం కొనసాగిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ చైనా పర్యటనకు కొద్ది రోజులు ముందుగానే ఆ వివాదానికి తెరపడింది. ఈ నేపథ్యంలో మోడీ, జిన్‌పింగ్‌ భేటీ ఆసక్తికరంగా మారింది. మంగళవారం వీరిద్దరూ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు.

చైనా నుంచి మయన్మార్ కు...

చైనా నుంచి మయన్మార్ కు...

రెండు రోజుల చైనా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ సహా ఇతర బ్రిక్స్‌ దేశాల నేతలతోనూ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా పర్యటన అనంతరం మోడీ అక్కడి నుంచి మయన్మార్‌ వెళ్తారు. మూడు రోజుల పాటు మయన్మార్‌లో పర్యటిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+