వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిమ్మల్ని లేపేస్తా: ఐఎస్ఐఎస్ బాలుడు (వీడియో)

|
Google Oneindia TeluguNews

సిరియా: ఇస్లాం మతాన్ని విశ్వసించని మీ అందరినీ చంపేస్తా అంటూ ఓ ఐదేళ్ల బాలుడు బ్రిటన్ ప్రభుత్వాన్ని, ఆ దేశ పౌరులను హెచ్చరిస్తున్న తాజా వీడియోను ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు విడుదల చేశారు.

బ్రిటన్ యాసలోనే ఆ బాలుడు బ్రిటన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. మీరు ఇస్లాం మతాన్ని గౌరవించరా అంటూ ప్రశ్నించాడు. ఇదే సమయంలో నారింజ పండు రంగు దుస్తులు ధరించిన ఐదుగురు బ్రిటన్ గూడచారులను మోకాళ్ల మీద కుర్చోపెట్టారు.

మిలటరీ దుస్తులు ధరించిన టెర్రరిస్టులు పాయింట్ బ్లాక్ రేంజ్ నుంచి ఆ ఐదు మందిని అతి దారుణంగా కాల్చి చంపేశారు. ఇదే సందర్బంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ను ఉద్దేశిస్తూ తీవ్రమైన హెచ్చరికలు చేశారు.

 Britain Denounces New Islamic State Video

ట్రైయిలర్ గా విడుదల చేసిన ఈ వీడియోలో ఆ బాలుడు బ్రిటన్ వాసులను హెచ్చరించడంతో పాటు గూడచారులను తుపాకితో కాల్చి చంపుతాం అని బెదిరించాడు. ఓ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది ఇంగ్లీష్ లో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ను తీవ్ర స్థాయిలో హెచ్చరించాడు.

నువ్వు శ్వేత భవనం బానిస, యూదుల అడ్డ గాడిద అయిన కామెరాన్ నీకు ఇదే మా సందేశం అంటూ గూడచారులను కాల్చిచంపేశారు. నువ్వు మాకు చిక్కితే మీ దేశం నిన్ను కాపాడుతుందా అని ప్రశ్నించారు. గూడచారులను వదిలేసినట్లే నిన్ను వదిలేస్తారని వ్యంగంగా అన్నారు.

నాలుగు విమానాలు పెట్టుకుని మా మీద యుద్ధానికి వస్తావా, నీ అంతు చూస్తాం, గతంలో మీ నాయకులు ప్రవర్తించినట్లే ఇప్పుడు నీవు ప్రవర్థిస్తున్నావు. మా సుప్రీం ఆదేశాల ప్రకారం మేము చట్టాన్ని అమలు చేస్తున్నామని ఆ ఉగ్రవాది కామెరాన్ ను హెచ్చరించాడు.

English summary
British Prime Minister David Cameron says a new Islamic State video that threatens Britain and shows the killing of five men accused of spying for the West.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X