ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపండి.. లేదంటే గుణపాఠం తప్పదు : పుతిన్‌కు బ్రిటన్ వార్నింగ్
ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు పాశ్చాత్య దేశాలు రగిలిపోతున్నాయి. సైనిక చర్యలను ఆపాలని సూచిస్తున్నాయి. ఇప్పటికే పలు ఆంక్షలను విధించాయి. అయినా రష్యా వెనుకడుగు వేయడంలేదు. మరింత దూకుడుతో ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తుంది. వందలాది మంది పౌరులు, సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు రష్యాకు వార్నింగ్ ఇస్తున్నాయి. మాటల వినకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నాయి.

పుతిన్‌కు బ్రిటన్ వార్నింగ్..
రష్యా తీరును బ్రిటన్ త్రీవంగా తప్పుపట్టింది. ఉక్రెయిన్‌లో పౌరులపై దాడులను ఖండించింది. రష్యా చర్యలను అనాగరిక చర్యలుగా అభివర్ణించింది. పోలండ్ పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రష్యాపై విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణలకు రష్యా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ లో ఉన్న వారి కమాండర్ లు యుద్ధ నేరాలకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రష్యా దారికి రానంత వరకే పాశ్చత్య దేశాల ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. రష్యా తక్కువగా అంచనా వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక ఆంక్షలను కొనసాగిస్తామని బోరిస్ పేర్కొన్నారు.
రష్యా ఓడలకు నో ఎంట్రీ ..
అటు రష్యా ఓడలను కూడా బ్రిటన్ నిషేధించింది. రష్యాతో సంబంధం ఉన్న అన్ని ఓడలను తమ నౌకాశ్రాయాల్లోకి రాకుండా నిషేధిస్తామని తెలిపింది. ఈమేరకు బిల్లును కూడా తీసుకువచ్చింది. రష్యాపై ఈవిధమైన చర్యలకు తీసుకున్న మొదటి దేశం బ్రిటన్. ఉక్రెయిన్‌పై రష్యా తన దాడులను ఆపాలని డిమాండ్ చేసింది. సైనిక బలగాలను వెనక్కి రప్పించాలని సూచించింది. రష్యా మాట వినకపోతే మరిన్ని ఆంక్షలు తప్పవని హెచ్చరించింది.

రష్యాతో విభేదాలు కోరుకోం..
మరోవైపు ఉక్రెయిన్‌లో తమ సైనిక చర్చలకు ముగింపు పలకాలని రష్యాను నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ కోరారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా నాటో ఈ యుద్ధంగా పాల్గొనదని తెలిపారు. యుద్ధ విమానాలను పంపబోమని పేర్కొన్నారు. తాము రష్యాతో విభేదాలు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలని కోరారు.












Click it and Unblock the Notifications