ఉక్రెయిన్ కు బ్రిటన్ ఆయుధాలు - ఆ హార్డ్ వేర్ కీలక పాత్ర : రష్యాకు సైన్యానికి అక్కడే చెక్..!!
రష్యా - ఉక్రెయిన్ యుద్దం అనేక మలుపులు తీసుకుంటోంది. ఇప్పటికే రష్యా పైన అనేక ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా..యూరోపియన్ యూనియన్.. మరో వైపు ఉక్రెయిన్ కు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్తున్న వేళ... బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా ఉక్రెయిన్ పైన చేస్తున్న దాడులను తొలి నుంచి వ్యతిరేకిస్తున్న బ్రిటన్ తాజాగా భారత్ ప్రధానితోనూ చర్చించింది. ఇదే సమయంలో..ఉక్రెయిన్‌కు ఆయుధాలతోపాటు ఆర్థికంగా మరింత సాయం అందిస్తామని బ్రిటన్ ప్రకటించింది.

ఉక్రెయిన్ కు ఆయుధాలు..ఆర్దికంగా
ఉక్రెయిన్ ఆర్మీకి 6 వేల మిస్సైళ్లు, 25 మిలియన్ పౌండ్ల ఆర్థిక సహాయం చేస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. యాంటీ ట్యాంక్ అధిక పేలుడు ఆయుధాలను బ్రిటన్ ఉక్రెయిన్ దేశానికి పంపించిందని ప్రధాని జాన్సన్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే 4వేల యుద్ధ ట్యాంకులు, లైట్ యాంటీ ట్యాంక్ వెపన్స్ సిస్టమ్స్, జావెలిన్ క్షిపణులను బ్రిటన్ అందించింది. రష్యన్ సైనికులు ఉక్రెయిన్ పట్టణాలు, నగరాలను ధ్వసం చేస్తుండగా తాము చూస్తూ ఉండలేమని, మాస్కో సైనికులను ఎదుర్కొవడానికి కీవ్‌కు మరింత సహాయం అందిస్తామని బ్రిటన్ ప్రధాని చెప్పారు. ఉక్రెయిన్‌కు మెరుగైన రక్షణాత్మక మద్దతులను అందించడంతోపాటు రష్యాపై ఆర్థిక పరమైన ఆంక్షలు రెట్టింపు చేయాలని పాశ్చాత్య దేశాలకు పిలుపునిచ్చారు.

బ్రిటన్ హార్డ్ వేర్ కీలకంగా..
ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాలను మరింతగా పెంచడానికి తమ భాగస్వామ పక్షాలతో కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక మద్దతును పెంచడానికి మా మిత్రదేశాలతో కలిసి యునైటెడ్ కింగ్ డమ్ పని చేస్తుందని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. తాము పంపిస్తున్న ఆయుధ సంపత్తిలో మిలిటరీ హార్డ్‌వేర్, యాంటీ ట్యాంక్, అత్యధిక పేలుడు సామర్థ్యం కలిగిన ఆయుధాలు ఉంటాయని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై చర్చించడానికి నాటో, జీ7 దేశాలు సమావేశమవుతున్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా వైమానిక బాంబు దాడులను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ దేశానికి శరీర కవచాలు, హెల్మెట్లను బ్రిటన్ అందిస్తోంది.

రష్యాను నిలువరించటమే లక్ష్యం..
ఉక్రెయిన్ రష్యా దండయాత్రను అరికట్టడంలో బ్రిటన్ పంపిన హార్డ్‌వేర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ సైన్యం దీని ద్వారా రష్యా సేనలను ఎదుర్కోవటంలో కీలకంగా వినియోగిస్తున్నారు. రష్యా క్షిపణుల దాడులను తిప్పి కొట్టటంలోనూ ఉపయోగిస్తున్నారు. రష్యాకు చెక్ పెట్టటంలో ఈ హార్డ్ వేర్ ది కీలకపాత్రగా అభివర్ణిస్తున్నారు. ఇక, అమెరికా అధ్యక్షుడు బైడెన్ తాజా పర్యటనతో ఈ ఉద్రికత్తలు మరింత పెరుగుతాయా.. లేద, దీనికి ముగింపు దిశగా రష్యా - ఉక్రెయిన్ చర్యలు ఉంటాయా అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా పరిణామాలను గమనిస్తున్నాయి.












Click it and Unblock the Notifications