గాల్లో విమానం తలుపు తెరవబోయింది
లండన్: గాలిలో వందల కిలోమీటర్ల ఎత్తులో వేల కిలోమీట్ల వేగంతో వెళుతున్న విమానం తలుపు తెరవడానికి ఓ మహిళా ప్రయాణికురాలు విఫలయత్నం చేసింది. అయితే సాటి ప్రయాణికులు విషయం గుర్తించి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన ఓ విమానం లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్ నగరానికి బయలుదేరింది. అదే విమానంలో పోలాండ్ దేశానికి చెందిన కమీలా డోల్ నియాక్ (32) అనే మహిళ ప్రయాణించింది.
మార్గం మధ్యలో ఒక్క సారిగా తన సీటులో నుంచి లేచిన కమీలా నేరుగా విమానం తలుపు దగ్గరకు వెళ్లింది. తరువాత తలుపు తియ్యడానికి విఫలయత్నం చేసింది. విషయం గుర్తించిన సాటి ప్రయాణికులు విమానంలోని సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

ప్రయాణికులు, సిబ్బంది కలిసి ఆమెను పట్టుకున్నారు. బోస్టన్ లో విమానం ల్యాండ్ అయ్యాక సిబ్బంది కమీలాను ఎయిర్ పోర్టు అధికారులకు అప్పగించారు. తరువాత కమీలాకు అపరాధ రుసుం విధించిన అధికారులు బోస్టన్ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
ఆమెకు మతిస్థిమితం లేకుండా ఇలా చేసిందా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నామని అధికారులు తెలిపారు. కమీలాకు ఉగ్రవాదులతో సంబంధాలు లేవని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. అయితే అధికారులు పలుకోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications