విమానంలో భార్యపై భర్త దాడి: ఎమర్జెన్సీ లాండింగ్
బోస్టన్: లండన్ నుంచి హ్యూస్టన్ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ఓ వ్యక్తి తన భార్యపై దాడికి దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఆ విమానాన్ని బోస్టన్‌లోని లోగన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దించివేశారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌కి చెందిన డారెన్ హలివేల్ విమానంలో భార్యతో గొడవపడి ఆమెపై భౌతిక దాడికి దిగాడు. తోటి ప్రయాణికులు అడ్డుకోగా వారిపై మండిపడ్డాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా దించి అతడిని పోలీసులకు అప్పగించారు.

విమాన సిబ్బంది, ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన అనంతరం విమానం హ్యూస్టన్‌కి తిరిగి ప్రయాణమైనట్లు అక్కడి అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications