వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నా కంప్యూటర్‌లో పోర్న్‌చిత్రాలు లేవు, తప్పుడు ఆరోపణలు'

తన కంప్యూటర్‌లో ఎలాంటి ఫోర్న్ వీడియోలు లేవని బ్రిటీష్ ఫస్ట్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ డామియన్‌ గ్రీన్‌ ఖండించారు.ఈ విషయమై తనపై వచ్చిన ఆరోపణలను గ్రీన్ ఖండించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లండన్: తన కంప్యూటర్‌లో ఎలాంటి పోర్న్ వీడియోలు లేవని బ్రిటీష్ ఫస్ట్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ డామియన్‌ గ్రీన్‌ ఖండించారు.ఈ విషయమై తనపై వచ్చిన ఆరోపణలను గ్రీన్ ఖండించారు.

2008లో కన్జర్వేటీవ్స్‌ ప్రతిపక్షంలో ఉండగా అధికారి డామియన్‌ కార్యాలయంపై కౌంటర్‌ టెర్రరిజం విభాగం ఆకస్మిక దాడులు చేపట్టింది. డామియన్‌ పర్సనల్‌ కంప్యూటర్లలో పోర్న్‌ వీడియోలు లభ్యమైనట్లు అప్పటి సీనియర్‌ పోలీస్‌ అధికారి బాబ్‌ క్విక్‌ మీడియాకు వెల్లడించారు.. రాజకీయ కారణాలతో తనపై ఆరోపణలు చేస్తున్నారని గతంలోనే బాబ్‌ క్విక్‌పై డామియన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

British minister Damian Green denies computer pornography allegations

పోర్న్‌ వీడియోలు, ఫొటోలు కలిగి ఉన్నాడన్న దానిపై కేబినెట్‌ ఆఫీసు విచారణ చేపట్టిందని హోం సెక్రటరీ అంబర్‌ రుడ్‌ తెలిపారు. తనపై డామియన్‌ అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు యత్నించారని ఓ మహిళా ఉద్యోగి తాజాగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫస్ట్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ పై నమోదైన అన్ని కేసులపై విచారణ జరుగుతోంది.

తనపై గతంలోనూ తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. తాను ఎలాంటి తప్పులు చేయలేదని డామియన్‌ చెబుతున్నారు. మహిళా ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించారన్న అరోపణల నేపథ్యంలో ఎంపీలు సమావేశం కావడంతో.. బ్రిటీష్‌ రక్షణశాఖ కార్యదర్శి మైఖెల్‌ ఫాల్లన్‌ తన పదవికి రాజీనామా చేశారు. తాను తప్పు చేసినట్లు అంగీకరించిన మైఖేలు క్షమాపణలు చెప్పారు.

English summary
The sexual harassment scandal that has rocked British politics took a new twist Saturday after one of Britain's most senior ministers denied allegations that "extreme" pornographic material was found on his work computer in 2008.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X