Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ POK ను స్వాధీనం చేసుకోవాలి.. బ్రిటన్‌ ఎంపీ సంచలనం

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK) విషయంలో బ్రిటన్‌ ఎంపీ బాబ్ బ్లాక్ మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ POK ను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. POK ప్రాంతంలో టెర్రరిజాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో మాదరిగానే జమ్మూకాశ్మీర్ మొత్తం ఒకే కేంద్ర పాలిత ప్రాంతంగా భారత్ లో కలవాలని కోరుకుంటున్నట్లు బ్లాక్ మాన్ స్పష్టం చేశారు. జైపూర్ లోని కాన్స్ స్టిట్యూషనల్ క్లబ్ లో ఏర్పాటు చేసిన హై-టీ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రిటన్‌ ఎంపీ బాబ్ బ్లాక్ మాన్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ నిర్ణయాన్ని తాము ఎప్పటినుంచో సమర్థిస్తున్నట్లు బ్రిటన్‌ ఎంపీ బాబ్ బ్లాక్ మాన్ తెలిపారు. POK ను పాకిస్థాన్ ఆక్రమించుకుని ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత్ POK ను స్వాధీనం చేసుకోవడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం భారత్ లో కలవాలని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ కాశ్మీర్‌ ను ఆక్రమించడాన్ని తాను గతంలో కూడా వ్యతిరేకించానని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దును తాను కొన్నేళ్ల క్రితమే ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. అయితే 2019లో ప్రధాని మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.


జైపూర్ లోని కాన్ స్టిట్యూషనల్ క్లబ్ లో ఏర్పాటు చేసిన హై- టీ ప్రోగ్రామ్ కు హాజరయ్యారు బాబ్ బ్లాక్ మాన్. " ఆర్టికల్ 370 రద్దును నేను 1992లోనే కోరుకున్నాను. కాశ్మీరీ పండిట్ లను జమ్మూ కాశ్మీర్ నుంచి బలవంతంగా బయటకు పంపించినప్పుడే నేను ఆర్టికల్ 370 రద్దు సూచన చేశాను. కాశ్మీరీ పండిట్ లను బలవంతంగా బయటకు పంపించినప్పుడు నేను బ్రిటన్ లో ఈ విషయంపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి ఇది తప్పు అని ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేశాం. అలాగే కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని నేను ఖండిస్తూ వస్తున్నా. పాకిస్థాన్ అక్రమంగా POK ను స్వాధీనం చేసుకోవడాన్నీ ఖండిస్తూ వస్తున్నా" అని బ్రిటన్‌ ఎంపీ బాబ్ బ్లాక్ మాన్ పేర్కొన్నారు.

British MP Bob Blackman Entire PoK Must Reunite with India Slams Pakistan s Illegal Occupation

మరోవైపు గతేడాది ఏప్రిల్ 22 న పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడిని బ్లాక్ మాన్ కూడా తీవ్రంగా ఖండించారు. ఇదే విషయంపై గతంలో యూకే పార్లమెంట్ లో మాట్లాడిన బాబ్.. ఉగ్రవాదుల ఘాతుకాన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడాన్ని సమర్థించారు. అయితే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని బ్లాక్ మాన్ సమర్థించినా.. పాకిస్థాన్ తో ఎప్పుడైనా ప్రమాదమే అని స్పష్టం చేశారు. భారత సరిహద్దుల్లో ఉగ్రవాదం పెరిగితే ఇరుదేశాల మధ్య కాల్పుల విమరణ ఒప్పందం ఉల్లంఘనకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

గత కొన్నేళ్లుగా కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడుతుండటంతో అక్కడ శాంతి ఉంటుందని భావించానన్నారు. కానీ పహల్గాం ఉగ్రదాడితో మళ్లీ ఉగ్రసమస్య వెలుగుచూసిందన్నారు. భారత సరిహద్దుల్లో ఉగ్రవాదం పెరిగితే ఇరుదేశాల మధ్య కాల్పుల విమరణ ఒప్పందం ఉల్లంఘనకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+