మాజీ భర్త బ్యుటిషయన్‌ను రేప్ చేసి చంపేశాడు

లాహోర్: బ్రిటిష్ - పాక్ బ్యుటిషియన్ హత్యోదంతంలో దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగు చూసింది. పాకిస్తాన్‌లో 28 ఏళ్ల బ్రిటిష్ బ్యుటిషియన్ ఆమె మాజీ భర్త హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీన్ని పరువు హత్యగా భావిస్తున్నారు. అయితే, అత్యాచారం చేసిన తర్వాత ఆమె గొంతు నులిమి చంపేసినట్లు పంజాబ్ పోలీసులు చెప్పారు.

డైలీ మెయిల్‌లో ఆ మేరకు ఓ వార్తాకథనం అచ్చయింది. సామియా షాహి పంజాబ్‌లోని తన బంధువుల వద్దకు వచ్చినప్పుడు ఆమె హత్యకు గురైంది. స్క్వార్ఫ్ గొంతుకు బిగించి మాజీ భర్త ఆమెను చంపేశాడు. గుండెపోటుతో ఆమె నిద్రలోనే చనిపోయిందని తొలుత అతను చెప్పాడు. ఆ తర్వాత మాట మార్చి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు.

British-Pak beautician was raped before being strangled by ex-husband

సామియా భర్త సయ్యద్ ముఖ్తర్ ఆరోపణతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడని అబద్ధం చెప్పి ఆమెను పాకిస్తాన్‌కు రప్పించారని, మరో సెక్ట్‌కు చెందిన వ్యక్తిని వివాహమాడిందని ఆమెను చంపేశారని ఆయన ఆరోపించాడు.

షియా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని పెళ్లాడినందుకు సామియాను చంపేశానని మాజీ భర్త మొహమ్మద్ షకీల్ విచారణలో చెప్పాడు. ఆమె తల్లిని, సోదరిని కూడా ప్రశ్నించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సామియా జులై 20వ తేదీన పంజాబ్ ప్రొవిన్స్‌లోని జేలూం జిల్లాలో గల మంగ్లా ఏరియాలో మరణించింది. అంత్యక్రియలను హడావిడిగా ముగించారు.

సామియా షకీల్ అనే సమీప బంధువును చేసుకుంది. 2014 మేలో అతనితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తక్షిలకు చెందిన కజీం అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వారిద్దరు దుబాయ్‌లో జీవిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+