విమానంలో ఆ పుస్తకం చదివిన యువతి అరెస్టు!
లండన్: విమానంలో సిరియా గురించి ఓ యువతి పుస్తకం చదువుతుండగా అనుమానం కలిగిన పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఇంగ్లాండులో చోటు చేసుకుంది. ఆమె సిరియా గురించి పుస్తకం చదువుతుంటే ఉగ్రవాదిగా భావించి అదుపులోకి తీసుకొని విచారించారు.
ఫైజా షహీన్ అనే ఓ బ్రిటిష్ యువతి యూకే నేషనల్ హెల్త్ సర్వీస్‌లో పని చేస్తోంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న యుక్తవయసు పిల్లలు తీవ్రవాదంవైపు ఆకర్షితులు కాకుండా చూసే కార్యక్రమంలో ఆమె పని చేస్తోంది.
కొద్ది రోజుల క్రితం పెళ్లైంది. ఈ నేపథ్యంలో హనీమూన్ కోసం టర్కీ వెళ్లి వస్తోంది. ప్రయాణంలో తాను తెచ్చుకున్న సిరియా ఆర్ట్ బుక్ పుస్తకం చదువుతోంది. దానిని చూసిన విమాన సిబ్బంది ఫైజా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

విమానం ఇంగ్లాండ్‌లో దిగగానే విమానాశ్రయ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని ఓ పావు గంట పాటు విచారించారు. దీనిపై ఫైజా మాట్లాడుతూ.. పాస్‌పోర్ట్ కంట్రోల్ రూం వద్ద క్యూలో నిలబడి ఉన్న తనను అక్కడే ఉన్న ఓ ఎయిర్‌పోర్ట్ అధికారి కన్నార్పకుండా గమనిస్తూనే ఉన్నాడని. తాను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్తుంటే ఇద్దరు పోలీసులు వచ్చి పాస్‌పోర్ట్ చూపించమన్నారని చెప్పింది.
తనకు ఏం అర్థం కాలేదని, ఏం జరిగిందని తాను పోలీసులను ప్రశ్నించానని, దానికి విమానంలో సిరియా పుస్తకం చదువుతుంటే ఉగ్రవాదేమోనన్న అనుమానంతో విచారణ జరుపుతున్నామని వారు చెప్పారని, పుస్తకం చదివితేనే ఉగ్రవాదని అనుమానించి ఈ విధంగా విచారణ జరిపారని ఇది సమంజసం కాదని పేర్కొంది.












Click it and Unblock the Notifications