ఆశ్చర్యం.. పురిటి నొప్పులు ఫేస్‌బుక్ లైవ్‌లో..
మహిళల ప్రసవ వేదన సినిమాల్లో చూపించేలా ఉండదు అంటూ సారాజేన్ కామెంట్ చేయడం గమనార్హం.
బ్రిటన్: సారాజేన్ లుంగ్‌స్ట్రామ్(35) అనే లండన్‌కు చెందిన ఓ యాడ్ ఏజెన్సీ డైరెక్టర్ ఏకంగా తన ప్రసవ వేదనను ఫేస్‌బుక్ ద్వారా లైవ్ ప్రసారం చేసింది. మహిళల ప్రసవ వేదన సినిమాల్లో చూపించేలా ఉండదు అంటూ సారాజేన్ కామెంట్ చేయడం గమనార్హం.

సోఫాలో కూర్చుని పిజ్జా తింటూనే తనకు కలిగిన లేబర్ పేయిన్స్‌ను లైవ్ ద్వారా చూపించింది. మూడో బిడ్డకు జన్మనిచ్చిన సందర్బంగా నెటిజెన్స్ కు ఈ లైవ్ వీడియోను చూపించింది. దాదాపు రెండు లక్షల పైచిలుకు జనం ఈ వీడియోను లైవ్ ద్వారా వీక్షించారు. వీడియోను వీక్షించిన నెటిజెన్స్ అందరికీ సారాజేన్ కృతజ్ఞతలు తెలిపారు.
తన మూడవ బిడ్డకు ఎవలినా బ్లాసమ్ అని సారాజేన్ నామరకరణం చేసింది. ప్రసవ సమయంలో తన కడుపులో జరిగిన ప్రతి కదలికను ఈ వీడియో ద్వారా వీక్షకులకు చూపించే ప్రయత్నం చేసింది.












Click it and Unblock the Notifications