భారత్ 5 స్టార్ హోటల్స్ vs పాకిస్థాన్ 5 స్టార్ హోటల్స్.. బ్రిటిష్ వ్లాగర్ వీడియో వైరల్

భారత్ లోని అనేక ప్రసిద్ధమైన పర్యాటక ప్రాంతాలను, స్ట్రీట్ ఫుడ్ లను ఆస్వాదించేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం అనేక మంది టూరిస్టులు వస్తుంటారు. ఇటీవలి కాలంలో భారత్ కు విదేశీ టూరిస్టుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అటు పాకిస్థాన్ కు కూడా కొద్దో గొప్పో విదేశీ టూరిస్టులు వస్తుంటారు. అయితే తాజాగా యూకేకు చెందిన ఓ వ్లాగర్ భారత్ లో అలాగే పాకిస్థాన్ లో కొన్ని రోజులు గడిపారు. పాకిస్థాన్ లోని 5 స్టార్ హోటల్స్ లో బస చేశారు. భారత్ లోని 5 స్టార్ హోటల్స్ లోనూ బస చేశారు. అయితే ఈ రెండు దేశాల్లోని 5 స్టార్ హోటల్స్ పై ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బ్రిటిష్ వ్లాగర్ హ్యారీ జగ్గార్డ్ ఈ మేరకు రివ్యూ ఇచ్చారు. హోలాఫీ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Britishvlogger Jaggard video goes viral now 5-star hotels in India vs 5-star hotels in Pakistan

భారత్ లోని ముంబైలో ఉన్న ఐకానిక్ తాజ్ ప్యాలెస్ లో తాను బస చేశానని.. అలాగే పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో ఉన్న ప్రముఖ హోటల్ పెర్ల్ కాంటినెంటల్ లోనూ బస చేశానని చెప్పుకొచ్చారు. ముంబైలోని తాజ్ ప్యాలెస్ లో ఉన్నప్పుడు అసలైన లగ్జరీని అనుభూతి చెందానని అన్నారు. సర్వీస్ క్వాలిటీ, ఇక్కడి వాతావరణం, హాస్పిటాలిటీ స్టాండార్డ్స్ కు ఫిదా అయినట్లు పేర్కొన్నారు. తాను ఓ నిజమైన 5 స్టార్ హోటల్ లోనే ఉన్న ఫీలింగ్ ఇక్కడ కలిగిందని వివరించారు. అయితే పాకిస్థాన్ కరాచీలోని పెర్ల్ కాంటినెంటల్ హోటల్ లోనూ తాను బస చేశానని కానీ అది అంత అద్భుతంగా ఏమీ లేదని పేర్కొన్నారు.

తాజ్ ప్యాలెస్ లో పొందిన అనుభూతిని పెర్ల్ కాంటినెంటల్ లో పొందలేదని యూకే వ్లాగర్ హ్యారీ జగ్గార్డ్ స్పష్టం చేశారు. అన్ని విధాలుగా పాకిస్థాన్ లోని హోటల్స్ వెనుకబడ్డాయని తెలిపారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో పేరుకే 5 స్టార్ హోటల్స్ అని చెబుతారు.. కానీ అవి 3 స్టార్ హోటల్స్ మాదిరిగానే ఉంటాయని వివరించారు. కానీ భారత్ లోని 5 స్టార్ హోటల్స్, అక్కడి సర్వీస్, యూకే, దుబాయ్ దేశాలను గుర్తు చేస్తాయని ప్రశంసించారు. భారత్ లో 5 స్టార్ హోటల్స్ అందుకు తగ్గట్లుగానే మెయింటెన్ చేస్తాయని తెలిపారు. ఇప్పటికే జీడీపీలో భారత్.. ఇంగ్లాండ్ ను దాటేసిందని అన్నారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ భారత్.. ఇంగ్లాండ్ కంటే ముందంజలో ఉందని వివరించారు. వ్లాగర్ హ్యారీ జగ్గార్డ్ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారి తీస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+