డేటింగ్‌లు మానుకో: బ్రిట్నీ స్పియర్‌కు తండ్రి హితవు
లండన్: డేటింగ్‌లు మానుకోవాలని పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్‌కు ఆమె తండ్రి సలహా ఇచ్చాడు. బ్రిట్నీ బాయ్ ఫ్రెండ్ చార్లీ ఎబెర్సోల్‌తో విడిపోయాక.. ఆమె డేటింగ్‌కు స్వస్తీ చెప్పాలని, మంచి వ్యక్తి కోసం చూడాలని సూచించారు.
తరచూ బాయ్ ఫ్రెండ్స్‌ను మార్చడం సరికాదని, ఇకనైనా డేటింగులకు దూరంగా ఉండాలని బ్రిట్నీ స్పియర్ తండ్రి ఆమెకు కాస్త గట్టిగానే చెప్పాడని చెబుతున్నారు. ఇటీవల తన లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ చార్లీ ఎబెర్సోల్ నుంచి బ్రిట్నీ విడిపోయింది.

చార్లీ దూరం కావడంతో, మానసికంగా ఆమె వేదనకు గురవుతోందని గుర్తించిన బ్రిట్నీ తండ్రి జేమీ స్పియర్స్... ఆమెను ఓదార్చే పనిలో ఉన్నాడు.
తనకు మరో ఫ్రెండ్ దొరికితే, చార్లీని మరచిపోతానని ఆమె తెగేసి చెప్పింది. ఈ విషయంలో కుమార్తె వాదనతో ఏకీభవించని ఆ తండ్రి... ఈ తరహా తిరుగుళ్లు ఇక వద్దని హితవు పలికినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే కెల్విన్ ఫెదర్ లైన్, జాసన్ అలెగ్జాండర్‌లను వివాహం చేసుకుని ఆ తర్వాత బ్రిట్నీ విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఆమె బాయ్ ఫ్రెండ్స్‌ను మారుస్తూ వార్తల్లో నిలుస్తోంది.












Click it and Unblock the Notifications