కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన గవర్నర్

న్యూఢిల్లీ: కాలిఫోర్నియా గవర్నర్ బ్రౌన్ ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించారు. లాస్ ఏంజెల్స్‌లోని పోర్టర్ రాంచ్ ప్రాంతంలో ఉన్న సదరన్ కాలిఫోర్నియా గ్యాస్ కంపెనీ ఆధీనంలో ఉన్న భూగర్భ గ్యాస్ బావుల నుంచి చాలా కాలంగా గ్యాస్ లీకవుతుంది.

అయితే ఇప్పుడు గ్యాస్ లీకేజీ తీవ్రత ఎక్కువ అవడంతో ఆందోళన చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన గవర్నర్ జెర్రీ బ్రౌన్ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించారు. గత పది వారాల నుంచి భూగర్భ స్టోరేజీ నుంచి 1200 టన్నుల మీధేన్‌తో పాటు ఇతర వాయువులు విడుదలవుతున్నాయని కాలిఫోర్నియా ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.

Brown declares state of emergency at Porter Ranch amid massive gas leak

ఈ గ్యాస్ లీకేజీ వల్ల ప్రజలు చాలా మంది అవస్వస్థకు గురవ్వడంతో పాటు తలనొప్పి, నోటి వెంట రక్తం రావడం లాంటివి జరిగాయని ఆ ప్రకటనలో వెల్లడించింది. గ్యాస్ లీకేజీకి పూర్తి బాధ్యత ఆ గ్యాస్ కంపెనీలే వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

దీనిపై సమీక్షించిన అనంతరం రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించినట్టు గవర్నర్ తెలిపారు. ఎమర్జెన్సీ విధించిన కారణంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఇకపై రాష్ట్రంలో ఉన్న భూగర్భ గ్యాస్ బావుల విషయంలో నూతన విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+