జైలు ఖైదీలకు భార్యలతో గడిపే అదిరిపోయే ఆఫర్; ఎక్కడంటే!!
వివిధ నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కోసం సంచలన నిర్ణయం తీసుకుంది ఓ దేశం. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు తమ జీవిత భాగస్వామితో జైల్లో ఏకాంతంగా గడిపే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో తొలిసారిగా ఏకాంత గదులను ఏర్పాటు చేసి మరీ జీవిత భాగస్వాములతో కలిసే లాగా అవకాశం కల్పిస్తున్నారు.
ఖైదీలకు దాంపత్య జీవన సౌకర్యం కల్పిస్తూ ఇటలీ ప్రభుత్వ నిర్ణయం
ఖైదీల విషయంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్న ఆ దేశం ఏమిటి? అసలు ఈ నిర్ణయం వెనుక కారణాలేమిటి? అన్నది తెలుసుకుందాం. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు దాంపత్య జీవన సౌకర్యాన్ని కల్పిస్తూ ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటలీలోని సెంట్రల్ ఉంబ్రియా ప్రాంతం లోని జైలులో ఏకాంత గదులను ఏర్పాటు చేశారు. ఈ ఏకాంత గదుల సదుపాయం శుక్రవారం నుండి అందుబాటులోకి వచ్చింది.

ఖైదీలకు ఏకాంత గదుల సదుపాయం
గత సంవత్సరం ఇటలీలో న్యాయస్థానం ఖైదీలు తమ భాగస్వాములను ప్రైవేటుగా కలుసుకునే హక్కు ఉందని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇక ఇటలీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ ఏకాంత గదుల సదుపాయం పట్ల ఖైదీల హక్కుల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఖైదీల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగకుండా చూసుకోవలసిన అవసరం
ఇక ఏకాంత గదులను ఏర్పాటు చేయడం చాలా మంచిదని, అయితే ఇందులో ఖైదీల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగకుండా చూసుకోవలసిన అవసరం ఉందని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఈ తరహా సదుపాయం ఇప్పటికే ఐరోపా దేశాలలో చాలా చోట్ల అందుబాటులో ఉంది. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, నెదర్లాండ్స్, స్వీడన్ లోని కొన్ని జైళ్ళలో ఖైదీలకు ఏకాంత గదులను ఏర్పాటు చేశారు.
ఖైదీల ఆత్మహత్య ఘటనలతో నిర్ణయం
గత కొంతకాలంగా ఖైదీల ఆత్మహత్య ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖైదీలు మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం వీటిని అరికట్టడం కోసం ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. ఖైదీలు తమ కుటుంబ సభ్యులకు ఎక్కువసార్లు ఫోన్ చేసుకునే వీలు కల్పించారు. తాజాగా భాగస్వాములతో ఏకాంతంగా కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications