చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 36 మంది మృతి, 36 మందికి గాయాలు
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పు జియాంగ్స్‌లో ఓ బస్సు ట్రక్కును ఢీ కొంది. ప్రమాద సమయంలో బస్సులో 69 మంది ఉన్నారు. బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటంతో మృతుల సంఖ్య పెరిగింది. బస్సు ప్రమాదంలో 36 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 36 మంది గాయపడ్డారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
జియాంగ్సు వద్ద నుంచి బస్సు వెళ్తుండగా ఎడమ టైర్ ఒక్కసారిగా పంక్ఛర్ అయ్యింది. దీంతో బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీ కొంది. గాయపడ్డ వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 26 మందిని ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించామని తెలిపారు. టైర్ పంక్చర్ అయి ట్రక్కును ఢీ కొనే సమయంలో బస్సు హై స్పీడ్‌లో ఉందని, కంట్రోల్ కాకపోవడంతో ట్రక్కును బలంగా ఢీ కొందని ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు.

జియాంగ్స్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరగడంతో చాంగ్‌చన్-షెన్‌జెన్ రహదారిపై రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. రహదారి రక్తపుమడుగుతో నిండిపోయింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దాదాపు 8 గంటల తర్వాత రహదారిపై ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేశారు. చైనాలో రహదారులు సరిగా ఉండటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. 2015లో రోడ్డు ప్రమాదాల వల్లే 58 వేల మంది ప్రజలు చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతోపాటు అక్కడి ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను 90 శాతం ఉల్లంఘిస్తారు. అందుకోసమే ఎక్కువగా రోడ్డుప్రమాదాలు జరుగుతుంటాయి.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications