2.8మిలియన్లకే అందమైన గ్రామం: ఎగబడుతున్న బడా బాబులు!

కెనడాలో పర్యాటకంగా ప్రసిద్ధి గాంచిన ఆ ఊరిని 2.8మిలియన్‌ డాలర్లకు(రూ.19.14కోట్లు) అమ్మకానికి పెట్టారు.

కెనడా: ప్రపంచంలో ఎక్కడైనా ఇళ్లు, భవనాలను అమ్మడం చూస్తాం కానీ, ఏకంగా ఒక గ్రామాన్ని అమ్మడం అనేది కొత్త విషయమే. గతంలో ఒకసారి యూరోప్‌లో ఇలాంటి ఘటన చోటు చేసుకోగా.. ఇప్పుడు కెనడాలో చోటు చేసుకుంటోంది. కెనడాలో పర్యాటకంగా ప్రసిద్ధి గాంచిన ఆ ఊరిని 2.8మిలియన్‌ డాలర్లకు(రూ.19.14కోట్లు) అమ్మకానికి పెట్టారు.

కెనడాలోని క్యూబెక్‌ నగరానికి సమీపంలో ఆ గ్రామం ఉంది. దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ ఊరిలో 45 భవనాలున్నాయి. అందులో 22 నివాసాలు.. సెలూన్‌.. ఒక చర్చి.. దుకాణం.. మిల్లు.. స్మశానం తదితరాలు ఉన్నాయి. అయితే ఎందుకో గానీ, కొన్నేళ్ల క్రితమే అక్కడి నుంచి అందరూ తమ నివాసాలను ఇతర ప్రాంతాలకు మార్చుకున్నారట. దీంతో ప్రస్తుతం చాలా ఇళ్లల్లో ఎవరూ నివసించడం లేదు.

Buy this 19th-century Quebec village for just $2.8 million

అయినా మంచు దుప్పటి కప్పినట్లుగా ఉండే ఆ అందమైన గ్రామం పర్యాటకంగా మంచి గుర్తింపు పొందింది. ఏటా దాదాపు 30 వేల మంది పర్యాటకులు ఆ గ్రామాన్ని సందర్శిస్తుంటారు. సినిమాలు, సీరియళ్లకు ఈ గ్రామం షూటింగ్‌ స్పాట్‌గా మారిపోవడం గమనార్హం. అంతేగాక, పలు హాలీవుడ్‌ సినిమాలనూ అక్కడ చిత్రీకరించడం విశేషం.

అంత పేరుగాంచిన ఈ గ్రామాన్ని ఇప్పుడు 'సోతెబైస్‌ ఇంటర్నేషనల్‌ కెనడా' అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ద్వారా అమ్మకానికి పెట్టారు. ఇన్ని విశేషాలున్న గ్రామం అంత తక్కువ ధరకు లభ్యమవుతుంటే ఏ బడా బాబు మాత్రం వదిలేస్తాడు?, అందుకే ఈ గ్రామాన్ని సొంతం చేసుకునేందుకు యూరప్‌లోని ప్రముఖ వ్యాపారవేత్తలందరూ పోటీ పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+