42వేల అడుగుల ఎత్తులో విమానం: ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!(పిక్చర్స్)
గాలిలో ప్రయాణిస్తున్న ఓ విమానంలోకి అనుకోని అతిథి అడుగుపెట్టింది. విమానం 42వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఓ మహిళ పండంటి పాపకు జన్మనివ్వడంతో ఈ అరుదైన చోటు చేసుకుంది. ఈ ఘటన టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమ
ప్యారిస్/ఇస్తాంబుల్: గాలిలో ప్రయాణిస్తున్న ఓ విమానంలోకి అనుకోని అతిథి అడుగుపెట్టింది. విమానం 42వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఓ మహిళ పండంటి పాపకు జన్మనివ్వడంతో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటుచేసుకుంది.

విమానంలోనే ఆడ శిశువుకు జన్మనిచ్చింది..
ఆదివారం గునియాలోని కోనాక్రే నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న విమానంలో నాఫీ దియాబే అనే ఫ్రెంచ్ మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చారు. 28 వారాల గర్భంతో ఉన్న నాఫీకి విమానంలో ఉండగా నొప్పులు వచ్చాయి. గమనించిన విమాన సిబ్బంది వెంటనే ఆమెకు సహాయం అందించారు.

సురక్షితంగా..
అంతేగాక, తోటి ప్రయాణికులు కూడా నాఫీకి డెలివరీ చేయడంలో సహాయపడ్డారు. దీంతో చిన్నారి విమానంలోనే సురక్షితంగా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ ఘటనతో విమాన సిబ్బంది సహా ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేశారు. ఆ చిన్నారితో ఫొటోలు కూడా దిగారు.

పేరూ పెట్టేశారు..
కాగా, విమానంలో పుట్టిన ఈ చిన్నారికి కదిజు అనే పేరు పెట్టింది ఆమె కన్నతల్లి. ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసో విమానం దించి తల్లీబిడ్డను ఆస్పత్రికి పంపించారు. తల్లీబిడ్డ క్షేమంగా, పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు తెలిపారు.

అభినందనల వెల్లువ
ఇది ఇలా ఉండగా, ఆ చిన్నారితో ఫొటోలు దిగిన విమాన సిబ్బంది ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఘటనపై సోషల్ మీడియా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి పుట్టిన ప్రదేశం గురించి సర్టిఫికేట్‌లో ఏం రాస్తారో.. అంటూ పలువురు నెటిజన్లు సందేహం వ్యక్తం చేయడం గమనార్హం.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications