కరోనా వైరస్ : అమెరికాలో హడల్.. కాలిఫోర్నియా సహా పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ..

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా మొదటి మరణం సంభవించడంతో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్ గెవిన్ న్యూసొమ్ అధికారిక ప్రకటన చేశారు. ఎమర్జెన్సీ విధించడంతో కరోనాను ఎదుర్కొనేందుకు కాలిఫోర్నియా రాష్ట్రానికి అత్యవసర సమాఖ్య నిధులు సమకూరనున్నాయి. అయితే ఇది డబ్బు కోసం చేసిన ప్రకటన కాదని.. వైరస్ వ్యాప్తి నియంత్రణకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చుకోవడానికేనని ప్రకటించారు. డబ్బు అనేది అసలు సమస్యే కాదని.. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఎమర్జెన్సీ దోహదపడుతుందని గవర్నర్ పేర్కొన్నారు. వైద్య శాఖ,ప్రభుత్వం,ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారని చెప్పారు.

ఇప్పటివరకు 150 కేసులు..

ఇప్పటివరకు 150 కేసులు..

ఎమర్జెన్సీ ప్రకటన కాలిఫోర్నియా సమాజానికి ఒక స్పష్టతను ఇస్తుందని..వ్యాప్తిని నియంత్రించడానికి ప్రయోజనకరంగా ఉంటుందని గవర్నర్ చెప్పారు.కాలిఫోర్నియా పబ్లిక్ హెల్త్ విభాగం సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌&ప్రివెన్షన్ విభాగంతో కలిసి పనిచేస్తోందన్నారు. లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం,శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో దిగే ప్రయాణికులకు అక్కడే స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నట్టు తెలిపారు.ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 150 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. అందులో 53 కాలిఫోర్నియాలో నమోదయ్యాయి.

వాషింగ్టన్‌లో 10 మంది మృతి..

వాషింగ్టన్‌లో 10 మంది మృతి..

కరోనా వైరస్ కారణంగా వాషింగ్టన్‌లోనూ 10 మంది మృతి చెందడంతో.. అక్కడ కూడా ఎమర్జెన్సీ విధించారు. అలాగే పలు అమెరికన్ నగరాల్లోనూ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని విధించారు. వాషింగ్టన్‌లో ఇప్పటివరకు 39 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే శాన్‌ఫ్రాన్సిస్కోలో గత నెలలోనే అక్కడి మేయర్ లండన్ బ్రీడ్ ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ విధింపుతో కరోనాను నియంత్రించేందుకు ఫెడరల్ గవర్నమెంట్ నుంచి మరిన్ని నిధులతో పాటు అవసరమైన మరింత సిబ్బందిని సమకూరుస్తుంది.

Recommended Video

    Coronavirus (COVID-19) : Sales of Masks, Sanitizers Increased Across India | Oneindia Telugu
     93వేల కేసులు 3వేల పైచిలుకు మరణాలు..

    93వేల కేసులు 3వేల పైచిలుకు మరణాలు..

    ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 93వేల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3500 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో చైనాలోనే 3వేల పైచిలుకు మరణాలు సంభివించగా.. అందులో 2305 మరణాలు వైరస్ పుట్టుకొచ్చిన వుహాన్ పట్టణంలో సంభవించాయి. బుధవారం కొత్తగా మరో 119 కేసులు నమోదు కాగా.. గురువారం 139 కేసులు నమోదయ్యాయి.వైరస్ వ్యాప్తిలో చైనా తర్వాతి స్థానాల్లో ఇటలీ,ఇరాన్,అమెరికా ఉన్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+