ఘోరం: 15ఏళ్లుగా గర్ల్‌ను సెక్స్ బానిసలా, 22ఏళ్ల జైలు
శాన్ ఫ్రాన్సిస్కో: ఓ యువతిని సెక్స్ బానిసగా మార్చుకున్న ఓ వ్యక్తికి కాలిఫోర్నియా న్యాయస్థానం ఇరవై రెండేళ్ల జైలు శిక్షను విధించింది. తన ఇంటి వెనుక భాగంలో బాధితురాలిని ఉంచి పదిహేనేళ్లుగా వేధిస్తున్నాడు. బాధితురాలికి పన్నెండేళ్ల వయస్సు ఉన్నప్పటి నుండి అతను ఈ ఘాతుకానికి పాల్పడుతున్నాడు.
నిందితుడి పేరు రౌల్ ఓచోవా. అతని వయస్సు 52. అమెరికాలోని రిచ్ మండ్‌లో నివాసముండే ఈ కామాంధుడికి కాలిఫోర్నియా న్యాయస్థానం 22 ఏళ్ళ జైలుశిక్ష విధించింది. వరసకు బంధువయ్యే ఆమెను అనుభవిస్తూ, ఆమెను సెక్స్ బానిసగా చేసుకున్నందుకు కోర్టు అతడికి ఈ శిక్ష ఖరారు చేసింది.

12 ఏళ్ళ వయసులో ఆ అపర కీచకుడి వద్ద పనిలో కుదిరిన ఆ బాలిక అప్పటి నుంచి పదిహేనేళ్ళ పాటు బయటి ప్రపంచానికి దూరంగా బతికింది. రౌల్ ఆమెను తన ఇంటి వెనుక ఓ షెడ్డులో ఉంచి, ఆమె బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేవాడట.
బాత్రూమ్‌కు వెళ్ళినా, నిర్దిష్ట సమయం లోపే బయటకు రావాలని కఠిన ఆంక్షలు విధించేవాడని తన న్యాయవాది ద్వారా ఆమె కోర్టుకు తెలిపింది. ఎప్పుడూ కామం నిండిన కళ్ళతో చూసే రౌల్ ఏనాడూ కనికరం చూపలేదని పేర్కొంది. ప్రస్తుతం ఆమె వయస్సు 27 ఏళ్ళు. బాధితురాలు తన కుటుంబ సభ్యుల సాయంతో కామంధుడి చెర నుంచి బయటపడింది.
బాధితురాలి పేరు, వివరాలు బయటకు చెప్పలేదు. కాగా, తనను వేధించిన ఘటనలు ఇతనను వెంటాడుతూనే ఉంటాయని ఆమె తెలిపింది. అతను తన పైన ఎప్పుడు జాలిపడలేదని పేర్కొంది. బంధువు అయినందుకు అతను తనను జాగ్రత్తగా చూసుకొని ఉండాల్సిందని కానీ అలా చేయలేదంది. కాగా, ఈ యువతి 2012 ఆగస్టు నెలలో తప్పించుకొని బయటకు వచ్చింది. తన కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె బయటపడింది.












Click it and Unblock the Notifications