సినిమా కథలా..: 21 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు
కాలిఫోర్నియా: సినిమా కథను తలపించేలా 18 నెలల వయస్సులో తప్పిపోయిన ఓ బాలుడు 21 ఏళ్ల తరవాత తల్లిని కలుసుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. కొడుకు స్టీవ్ గురువారం నాడు తల్లి మరియా వద్దకు చేరుకున్నాడు.
మరియా తన భర్త, కొడుకు స్టీవ్‌తో కలిసి కాలిఫోర్నియాలో ఉడేది. భార్యాభర్తలకు నిత్యం గొడవ అయ్యేది. 1995లో భర్త కొడుకును తీసుకొని భార్యకు దూరంగా వెళ్లిపోయాడు. అప్పుడు కొడుకు స్టీవ్ వయస్సు పద్దెనిమిది నెలలు మాత్రమే. అప్పటికి ఆమె వద్ద కొడుకు ఫోటో మాత్రమే ఉంది.

ఆ ఫోటో ఆధారంగా కొన్నాళ్లకు కొడుకు కోసం వెతికింది. ఎక్కడెక్కడో వెతికిన తర్వాత మెక్సికోలోని ప్యూబ్లాలో నివసిస్తున్నట్లు అధికారులు గుర్తంచి, ఆమె వద్దకు తీసుకెళ్లారు. తొలుత స్టీవ్‌ను చూసి నమ్మలేదు. ఆ తర్వాత నిర్ధారించుకుంది. 21 ఏళ్ల తర్వాత యువకుడిగా దగ్గరైన కొడుకును చూసి ఆమె ఆనందబాష్పాలు రాల్చింది.












Click it and Unblock the Notifications