అన్‌బిలీవబుల్: అద్దం పగులగొట్టి కార్లో కూర్చున్నఒంటె
రియాద్: ఓ ఒంటె కారు ఎక్కి దర్జాగా సీట్లో కూర్చున్న సంఘటన సౌదీ అరేబియాలో జరిగింది. కారులో కూర్చొని అది కాసేపు కంగారు పెట్టింది. ఇద్దరు వ్యక్తులు సరదాగా డ్రైవ్‌కి వెళ్లారు. ఇంతలో అక్కడకు ఓ ఒంటె వచ్చింది. దీంతో వారు కారు నెమ్మది చేశారు.

అయితే, ఆ ఒంటె పూనకం వచ్చిన దానిలా కారు పైకి ఎక్కింది. కాలితో అద్దాన్ని ధ్వంసం చేసింది. టాప్ పైకి ఎక్కి దాన్ని ధ్వంసం చేసి సీట్లో కూలబడింది. ఈ ఘటనలో కారులో కూర్చున్న వ్యక్తులకు రక్తస్రావం అయింది. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. వీడియోలో సదరు ఒంటె... అద్దం ముక్కలై, టాప్ లేచిపోయిన కారులో నుంచి ఒంటె పైకి తలెత్తి చూస్తున్నట్లుగా ఉంది. కాగా, ఈ వీడియోను గురువారం వరకు కొన్ని గంటల్లోనే ఇరవై అయిదువేల మందికి పైగా చేశారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications