మోడీ వైపు మొగ్గుతున్న బ్రిటన్ ప్రధాని కామెరూన్

 Cameron to woo Modi
లండన్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. గుజరాత్ ముఖ్యమంత్రితో సత్సంబంధాలు కొనసాగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోందని కామెరూన్ తెలిపారు.

మోడీని ప్రధాని అభ్యర్థిగా బిజెపి ప్రకటించిన నేపథ్యంలో బ్రిటన్ ఆయనతో సత్సంబంధాల కోసం చూస్తోంది. ది ఈస్టెర్న్ ఐ అనే వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... మోడీతో సత్సంబంధాలు కొనసాగించేందుకు ఇది అనుకూల సమయమని చెప్పారు.

మానవ హక్కులతో పాటు ఇతర లక్ష్యాల సాధనకు కృషి చేస్తామని చెప్పారు. 2014 ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తే మోడీకి బ్రిటన్ వీసా ఇస్తుందా అని ప్రశ్నిస్తే... ఏ వీసా అయినా నిబంధనలకు లోబటే ఇస్తారని, భారత్‌తో దృఢ ద్వైపాక్షి సంబంధాలపై తాము కట్టుబడి ఉన్నామని, ఆ సమావేశాలకు భారత ప్రధానిని ఆహ్వానిస్తామని చెప్పారు.

కాగా, 2002 గుజరాత్ అల్లర్ల తర్వాత బ్రిటన్, అమెరికా సహా పలు దేశాలు మోడీకి దూరంగా ఉంటున్నాయి. ఆయనకు వీసా ఇచ్చేందుకు నిరాకరించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+