కామెరూన్ ఉపప్రధాని భార్యను ఎత్తుకెళ్లిన ఉగ్రవాదులు

అంతేగాక, ఏకంగా ఆ దేశ ఉప ప్రధాని అమదై అలీ ఇంటిపై దాడి చేసి ఆయన భార్యను అపహరించుకుపోయారు. నగర మేయర్‌ను అపహరించుకుపోయారు. ఉగ్రవాదులు చేసిన దాడిలో పది మంది పౌరులు చనిపోయినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.
మరో ఘటనలో ఓ మత బోధకుడు, లమిడోగా ప్రసిద్ధి చెందిన సెయినీ బౌకర్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఇస్లామిక్ ఉగ్రవాది సంస్థ అయిన బోకారో హరామ్ ఉగ్రవాదులు గత ఏప్రిల్‌లో ఉత్తర నైజిరియాలోని చిబోక్‌లో సుమారు 200 మంది పాఠశాలల బాలికలను అపహరించారు.
గత జూన్‌లో అబుజాలో బాంబుదాడులకు పాల్పడిన ఈ ఉగ్రవాదులు 21మంది ప్రజల ప్రాణాలను బలిగొన్నారు. నైజిరియా, ఉత్తర కామెరూన్, నైజర్ ప్రాంతాల్లో బోకా హరామ్ తన స్థావరాలను ఏర్పరచుకుంది. ఇప్పటికే అమెరికా, యున్ సెక్యూరిటీ కౌన్సిల్.. బోకో హరామ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.












Click it and Unblock the Notifications