డొనాల్డ్ ట్రంప్‌పై ముప్పేట దాడి- అప్పుడే తిరుగుబాటు?
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెర తీశారు. అక్రమ వలసలను ఉక్కుపాదంతో అణచివేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో మూడు దేశాలపై కొరడా ఝుళిపించారు. భారీగా టారిఫ్ విధించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు ట్రంప్.
ట్రంప్ టారిఫ్‌ను ఎదుర్కొంటోన్న దేశాల్లో కెనడా, మెక్సికో, చైనా ఉన్నాయి. ఈ మూడు దేశాలపైనా విధించిన సరికొత్త టారిఫ్ తక్షణమే అమలులోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మూడు దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని రకాల వాహనాలు, వస్తువులు, సరుకులు, ఆహార పదార్థాలపై కొత్త టారిఫ్‌కు అనుగుణంగా డ్యూటీని వసూలు చేస్తారు.

ఈ మూడింట్లో మెక్సికోపై అత్యధికంగా టారిఫ్ భారం పడింది. 25 శాతం టారిఫ్‌ను అదనంగా చెల్లించాల్సి ఉంటుందా దేశానికి. కెనడా, చైనాలపై 10 శాతం మేర టారిఫ్‌ను విధించింది అమెరికా. ఇందులో కెనడాకు కాస్త ఊరట కల్పించారు ట్రంప్. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే ఇంధన సంబంధిత ఉత్పత్తులను ఈ కొత్త టారిఫ్ నుంచి మినహాయింపునిచ్చారు.
ఈ కొత్త టారిఫ్- ట్రేడ్ వార్‌కు దారి తీసింది. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన కొద్దిసేపటికే కెనడా, మెక్సికో, చైనా ఘాటుగా స్పందించాయి. తిరుగుబాటు మొదలుపెట్టాయి. ట్రంప్‌పై ముప్పేటదాడికి దిగాయి. తాము కూడా అమెరికాపై కొత్త టారిఫ్2ను విధిస్తున్నట్లు ప్రకటించాయి.
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో విలేకరులతో మాట్లాడారు. 155 బిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికా దిగుమతులపై 25 శాతం కొత్త టారిఫ్‌ను అమలు చేయనున్నట్లు తెలిపారు. కెనడియన్ డాలర్లతో పోల్చుకుంటే దీని విలువ సుమారు 106 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది.
అమెరికా తరహాలోనే తాము ఆ దేశ వస్తువులపై టారిఫ్ విధించినట్లు ట్రూడో ప్రకటించారు. అమెరికన్ బీర్, వైన్, బోర్బన్, పండ్లు, పండ్ల రసాలు, ఆరెంజ్ జ్యూస్, కూరగాయలు, పెర్ఫ్యూమ్, దుస్తులు, బూట్లు.. వంటి రోజువారీ వస్తువులపై 25 శాతం పన్నును వర్తింపజేసినట్లు వెల్లడించారు.
గృహోపకరణాలు, ఫర్నిచర్, క్రీడా సామాగ్రి వంటి ప్రధాన ఉత్పత్తులు, కలప, ప్లాస్టిక్‌ల వంటి మెటీరియల్‌ను సైతం కొత్త టారిఫ్ పరిధిలోకి తెచ్చామని ట్రూడో చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. అమెరికా స్వర్ణయుగం మొదలు కావాలనుకుంటే తమతో ఘర్షణ వైఖరికి దిగకుండా ఉండాలని సూచించారు. స్వర్ణయుగాన్ని తీసుకుని రావడం అంటే పొరుగు దేశాలను శిక్షించడం కాదని ట్రూడో అన్నారు.
అటు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ సైతం అమెరికాపై కొత్త టారిఫ్‌ను విధించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అమెరికా నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్లాన్ బీని అమలుచేస్తోన్నామని ఆమె ప్రకటించారు. మెక్సికో ప్రయోజనాలను కాపాడుకోవడంలో భాగంగా టారిఫ్ విధించినట్లు తెలిపారు.
అమెరికాలో నివసించే తమ దేశ పౌరులు నేరస్తులని, నేర ప్రవృత్తిలో కొనసాగుతున్నారంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చుతున్నట్లు క్లాడియా వెల్లడించారు. అలాగే తమ భూభాగంలో జోక్యం చేసుకునే ఉద్దేశంతోనే వైట్ హౌస్ చేసిన ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
అటు చైనా కూడా దీనిపై స్పందించింది. ట్రేడ్ వార్ మంచిది కాదంటూ హితవు పలికింది. సుహృద్ధావ వాతావరణంలో ప్రపంచ దేశాలు ఐక్యంగా కలిసి పని చేయాల్సి ఉంటుందంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
-
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
ఖమేనీ సంధి ఒప్పందం? -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications