corona alert: కెనడా ప్రధాని సతీమణికి పాజిటివ్, నిర్ధారించిన పీఎంవో..

కరోనా మహమ్మరి రోజురోజుకు విస్తరిస్తోంది. సామాన్యుల నుంచి అత్యున్నత స్థాయి వ్యక్తులకు కూడా పాజిటివ్ వస్తోంది. మొన్న బ్రిటన్ వైద్యారోగ్యశాఖ మంత్రికి వైరస్ సోకగా.. నిన్న హాలీవుడ్ దంపతులకు పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భార్యకు కూడా పాజిటివ్ సోకిందనే అంశం కలవరానికి గురిచేసింది. దగ్గు, జలుబుతో బాధపడుతోన్న సోఫి గ్రెగోయిర్ ట్రూడోకు కరోనా వైరస్ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది.

Recommended Video

    3 Minutes 10 Headlines | Coronavirus In India | Share Markets | Amit Shah On NPR | Oneindia Telugu

    సోఫికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని కెనడా ప్రధానమంత్రి కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఆమెను వెంటనే ఐసోలేషన్ వార్డులో ఉంచి.. చికిత్స అందిస్తున్నామని తెలిపింది. అయితే ఆమె సన్నిహితంగా మెలిగిన జస్టిన్ ట్రూడో.. కుటుంబసభ్యులు, అధికారులు, సిబ్బందికి కూడా పరీక్షలు చేస్తామని సంకేతాలు ఇచ్చింది. కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు తప్పవని జస్టిన్ ట్రూడో తెలిపినట్టు ఒక ప్రకటనలో పీఎంవో తెలిపింది.

    Canada PM Justin Trudeau’s wife tests positive for coronavirus

    ఇప్పటికే బ్రిటన్ వైద్యారోగ్య జూనియర్ మంత్రి నాడిన్ డోరీస్‌కు, హాలీవుడ్ దంపతులు టామ్ హంక్స్ కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ప్రబలడంతో తన షోను వాయిదా వేసుకున్నానని ప్రముఖ గాయనీ సీలైన్ డియాన్ ప్రకటించారు. ఆమె జలుబుతో బాధపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను ఇప్పటికే వైద్య పరీక్షలు చేసుకున్నానని.. అందులో కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ఎందుకైనా మంచిది.. ప్రజలతో దగ్గరగా ఉండకుంటే బెటర్ అని షో ని వాయిదా వేసుకున్నానని వివరించారు. ఈ క్రమంలో కెనాడ ప్రధాని సతీమణికి వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+