ఎన్నికల ప్రచారంలో నగ్న ఫోటోలు: చర్యలు తీసుకోలేమన్న అధికారులు
టోక్యో: ఎన్నికలొచ్చి వేళ..... ఓటర్లను ఆకర్షించడంలో ఒక్కో చోట ఒక్కో నేతది ఒక్కోరకమైన పంథా. జపాన్ రాజధాని టోక్యోలని ఛియోడా వార్డుకు జరుగుతున్న ఎన్నికల పోరులో నిలిచిన తెరుకీ గోటో, ఓటర్ల దృష్టిలో పడేందుకు మరింత భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.
నగ్నంగా నిలబడి ఫోటోలో జపాన్ యుద్ధవీరుడిలా పోస్టర్‌పై దర్శనమిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తెరుకీ చేస్తున్న ఈ తరహా ప్రచారంతో అక్కడ హాట్ హాట్‌గా మారాడు. అయితే నగ్న పోస్టర్ ప్రచారంతో ఓటర్ల దృష్టిని ఆకర్షించిన తెరుకీ వ్యవహారంపై పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల్లో ఇలాంటి సంప్రదాయాలకు చోటివ్వకూడదని ఇతరపార్టీల నేతలు మండిపడుతున్నారు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, ఎన్నికల ప్రచారంలో నగ్న ఫొటోలను వాడుకోవడంపై నిషేధం విధించలేదని, తప్పుడు సమాచారంతో ఓటర్లను మభ్యపెట్టే విధంగా ఉంటే చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications