సిగరేట్ కాలుస్తూ.. శానిటైజర్ రాసుకోవడంతో మంటలు, కారు బుగ్గి.. చావు తప్పు కన్ను లొట్టబోయి..
కరోనా కల్లోలం కొనసాగుతోంది. వైరస్ నుంచి విముక్తి కావాలంటే మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకోవాల్సిందే. శానిటైజర్‌కు మండే స్వభావం ఉంటుంది. సిలిండర్, నిప్పుకి దూరంగా ఉండాల్సిందే. కానీ కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. అమెరికాలో కూడా ఒకరు సిగరేట్ కాలుస్తూ.. శానిటైరజ్ వాడడు. ఇంకేముంది మంటలు చెలరేగాయి. అప్పుడప్పుడు చేసే చిన్న తప్పులు కూడా ప్రమాదానికి దారితీస్తాయనడానికి ఇదీ సాక్ష్యంగా నిలిచింది.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుండడంతో చాలా మంది శానిటైజర్ వాడకాన్ని తమ జీవితంలో ఓ భాగం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో శానిటైజర్ వినియోగం బాగా పెరిగింది. శానిటైజర్ వల్ల కొన్ని అనర్థాలు కూడా తలెత్తుతున్నాయి. తాజాగా శానిటైజర్ కారణంగా ఓ భారీ ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికాలోని రాక్‌విల్లే షాపింగ్ సెంటర్ పార్కింగ్ వద్ద ఒక వ్యక్తి కారులో కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు. అదే సమయంలో శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నాడు.

ఇంతలో శానిటైజర్ చుక్కలు కొన్ని అతడి బట్టలపై పడ్డాయి. అదే సమయంలో సిగరెట్ నుంచి కొన్ని నిప్పు రవ్వలు కూడా పడ్డాయి. దీంతో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారుకు నిప్పంటుకుంది. సదరు వ్యక్తి వెంటనే కారు నుంచి దూకేయడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. శరీరం స్వల్పంగా కాలడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకునే లోపు కారు పూర్తిగా తగలబడిపోయింది.
అతను చేసిన తప్పుకు కారు బుగ్గి పాలయ్యింది. అదృష్టం బాగుండబట్టి అతను ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే ఏం జరిగేదో ఊహించలేం. సో అందరూ శానిటైజ్ చేసుకొండి.. చేసుకోవాలి, కానీ జాగ్రత్త పాటించడం తప్పనిసరి అనే విషయం మాత్రం మరవద్దు.
ICYMI (~530p) vehicle fire at Federal Plaza, 12200blk Rockville Pike, near Trader Joe’s & Silver Diner, @mcfrs PE723, M723, AT723 & FM722 were on scene (news helicopter video) pic.twitter.com/TeAynaGsgp
— Pete Piringer (@mcfrsPIO) May 13, 2021












Click it and Unblock the Notifications