Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నా భర్తతో పెట్టుకుంటావా: దుమ్ము లేపేసింది (వీడియో)

న్యూయార్క్: కారు పార్కింగ్ చేసే విషయంలో ఇద్దరు మహిళలు గొడవపడటంతో ఒక మహిళ శరీరంలోకి అమ్మోరు వచ్చేసింది. అంతే చీపురుపుల్లలా ఉన్న సాటి మహిళను నడి రోడ్డు మీద వేసి ముఖం మీద పిడిగుద్దులు గుద్దింది. అంతటితో ఆగకుండ కార్ల మధ్యతిప్పితిప్పి కొట్టి కసి తీర్చుకుని కూల్ గా వెళ్లి పోయింది.

న్యూయార్క్ లోని వాలీ స్ట్రీమ్ లోని గ్రీన్ ఎకర్స్ మాల్ దగ్గర పార్కింగ్ స్థలంలో ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం లటోయియా (24) అనే మహిళ ( వైట్ డ్రస్ వేసుకుని సన్నగా ఉన్న మహిళ ) పార్కింగ్ స్థలంలొ కారు పార్క్ చెయ్యడానికి డ్రైవర్ తో కలిసి వెళ్లింది.

ఆ సమయంలో ఒక వ్యక్తి మా కారు ఇక్కడ పార్క్ చేసుకుంటామని, మీరు వేరే చోట పార్క్ చేసుకొవాలని చెప్పాడు. లటోయియా కారు డ్రైవర్ వాహనం వెనక్కి తీసుకు వచ్చాడు. ఆ సందర్బంలో ఎందుకు నీవు కారు వెనక్కి తీసుకు వచ్చావు అని లటోయియా అడిగింది.

డ్రైవర్ జరిగిన విషయం చెప్పడంతో లటోయియా నేరుగా కారు పార్క్ చేస్తున్న వ్యక్తి దగ్గరకు వెళ్లింది. తన కారు వెనక్కి పంపించి నీవు కారు పార్క్ చేస్తావా అంటు వాగ్వివాదానికి దిగింది. అంతే అతని భార్య త్వానా మోరెల్ (నల్లగా లావుగా ఉన్న మహిళ) కారు దిగి బయటకు వచ్చింది.

 car parking problems... 2 women fight in new york

నా భర్తతో ఎందుకు వాదిస్తున్నావు అని గొడవపడింది. అంతటితో శాంతించని 35 సంవత్సరాల త్వానా నడి రోడ్డు మీద చీపురు పుల్లలా ఉన్న మహిళను కిందకు వేసి పిడిగుద్దులతో దాడి చేసింది. ఆమెను అడ్డుకొవడానికి సొంత భర్త సైతం సాహసించలేదు.

లటోయినాను రోడ్డు మీద పడవేసి మీద కుర్చుని ఇష్టం వచ్చినట్లు కొట్టింది. అంతే కాకుండ జట్టుపట్టుకుని లాగి కార్ల మధ్యకు లాక్కోని వెళ్లి కొట్టింది. ఈ సందర్బంలో అక్కడ ఉన్న వారు ఆమె ఉగ్రరూపంచూసి పరుగు తీశారు తప్ప ఆ మహిళను అడ్డుకొవడానికి ఎవ్వరు సాహసించలేకపోయారు. న్యూసెన్స్ కేసు కింద ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+