గూగుల్ తప్పిదం: రూ.800తో 'గూగుల్.కామ్'ను కొనేశాడు
సెర్చింజన్ గూగుల్ డొమైన్ సర్వీసుల్లోని సెక్యూరిటీ లోపాలు మరోసారి బహిర్గతమయ్యాయి. అమెరికాలోని ఓ ప్రతిష్టాత్మక కాలేజీలో ఎంబీయే విద్యను అభ్యసిస్తున్న సన్మే వేద్ అవే విద్యార్ధి ఏకంగా 'గూగుల్.కామ్' వెబ్ డొమైన్‌ను 12 డాలర్లకు సెప్టెంబర్ 29న కొనుగోలు చేశాడు.
అంతేకాదు 'గూగుల్.కామ్' వెబ్ డొమైన్ ఇక తన సొంతమని ఈ మెయిల్ కూడా వచ్చింది. అయితే మరో నిమిషం తర్వాత జరిగిన తప్పును తెలుసుకున్న గూగుల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఈ లావాదేవీ పొరపాటున జరిగిందని చెబుతూ, దీనిని రద్దు చేస్తున్నామని ప్రకటించింది.
తమ తప్పుని అంగీకరించిన గూగుల్ యాజమాన్యం విద్యార్ధి వేద్‌కు భారీ ఎత్తున నగదు పరిహారంగా ఇచ్చేందుకు కూడా అంగీకరించింది. అయితే వేద్‌కు ఎంత మొత్తంలో పరిహారం ఇచ్చిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

కాగా, ఈ పరిహారం వందల కోట్ల రూపాయల్లో ఉందని సమాచారం. తనకు పరిహారంగా వచ్చిన మొత్తాన్ని అమెరికాలోని ఇండియన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్‌కు ఇస్తానని వేద్ వెల్లడించడంతో, తామివ్వాలనుకున్న మొత్తాన్ని రెట్టింపు చేస్తున్నట్టు గూగుల్ యాజమాన్యం ప్రకటించింది.
ఈ స్టోరీపై గూగుల్ ప్రతినిధులు మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ విషయంపై వేద్ తన అనుభవాన్ని లింక్డ్ ఇన్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు. తాను సెప్టెంబర్ 29న గూగుల్.కామ్ అమ్మకానికి ఉన్నట్టు గుర్తించి ఆ వెంటనే తన క్రెడిట్ కార్డు ద్వారా దాన్ని కొనుగోలు చేశానని అందులో పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications